హాలియా, జూన్ 27 : నల్లగొండ జిల్లా అనుముల మండలం పాలెం గ్రామ సమీపంలో డంపింగ్యార్డు వద్ద పేకాట ఆడుతున్న 7గురిని శుక్రవారం హాలియా పోలిసులు అరెస్ట్ చేశారు. ఎస్ఐ సాయిప్రశాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పాలెం గ్రామ సమీపంలో డంపింగ్ యార్డు వద్ద పేకాట అడుతున్నారనే నమ్మదగిన సమాచారం మేరకు పోలిస్సిబ్బందితో వెళ్లి పేకాట స్థావురంపై దాడిచేసి కాల్సానీ రామకృష్ణ, మోసంగి కృష్ణయ్య, కాట్నం శేఖర్, బురుగు ఆశోక్ కుమార్, గుమ్మడవెల్లి సైదులు, బోడ్డుపల్లి సత్యనారాయణ అనే ఏడుగురిని అరెస్ట్ చేసినట్లు ఆయన తెలిపారు.
రోయ్య మహేందర్, కాట్నం వెంకటయ్య, కాట్నం రాజులు అనే మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు ఎస్ఐ తెలిపారు. వారి వద్ద నుంచి 1950 రూపాయలు, 5 సెల్ఫోన్లు, 5 బైక్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. తెలంగాణ గేమింగ్ చట్టం 1974 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.