కోదాడ, డిసెంబర్ 24 : గ్రామంలోని ప్రజలకు సేవ చేస్తారనే నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించారని, వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ సేవ చేయాలని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. మంగళవారం కోదాడలోని తన నివాసంలో మోతే మండలం హుస్నాబాద్ గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా ఎన్నికైన అక్కినపల్లి శ్రీరాము, ఇతర వార్డు సభ్యులను ఆయన శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామంలోని సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలని సూచించారు. అభివృద్ధిలో రాజీ పడవద్దని సర్పంచ్ చెక్ పవర్ ఉందని ఈ అంశంలో ఎవరికి తలవంచాల్సిన అవసరం లేదన్నారు. పార్టీలకతీతంగా గ్రామ అభివృద్ధికి తోడ్పడాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు శీలం సైదులు, నాయకులు రవి జానారెడ్డి, సంజీవరెడ్డి, రామిరెడ్డి, గోవర్ధన్ రెడ్డి, విజయ్, సుధాకర్ పాల్గొన్నారు.