రామగిరి, నవంబర్ 10 : ఎన్ఎస్ఎస్ జాతీయ సమైక్యతా శిబిరానికి వాలంటీర్ల ఎంపిక నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో సోమవారం నిర్వహించారు. భారత ప్రభుత్వ క్రీడలు యువజనుల సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో గుజరాత్ రాష్ట్రంలో ఈ నెల 22 నుండి 28 వరకు సర్దార్ పటేల్ యూనివర్సిటీ, వల్లభ విద్యానగర్, ఆనంద్ జిల్లాలో నిర్వహించే జాతీయ సమైక్యత శిబిరం-2025కు ఉమ్మడి నల్లగొండ జిల్లా నుండి అర్హులైన వాలంటీర్లను నేడు ఎంపిక చేశారు. ప్రతిభ చూపిన వారికి భాషా పరిజ్ఞానం, కమ్యూనికేషన్స్ స్కిల్స్, సాంస్కృతిక అంశాల్లో ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఎన్ఎస్ఎస్ కో ఆర్డినేటర్ డాక్టర్ మద్దిలేటి మాట్లాడుతూ.. విద్యతో పాటు సామాజిక సేవ చేసేందుకు జాతీయ సమైక్యత శిబిరం చక్కటి వేదిక అన్నారు. ఎంపికైన విద్యార్థులను వర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ అల్వాల రవి, డీన్ ప్రొఫెసర్ కొప్పుల అంజిరెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో పీఓలు అపర్ణ, ఆనంద్, స్రవంతి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు, ఎన్ఎస్ఎస్ కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ హరికిషన్ పాల్గొన్నారు.
పురుషుల విభాగంలో.. కె.గణేశ్, యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల మహాత్మాగాంధీ యూనివర్సిటీ
మహిళా విభాగంలో.. సి.హెచ్ సిరివెన్నెల, టీజీడబ్ల్యూఆర్ ఏ ఎఫ్ పి డి సి డబ్ల్యూ భువనగిరి.

Ramagiri : జాతీయ సమైక్యత శిబిరానికి వాలంటీర్ల ఎంపిక