నీలగిరి, అక్టోబర్ 12 : ఎన్నికల్లో జరిగే అక్రమాలు, ఉల్లంఘనలపై ఫిర్యాదు చేసేందుకు ఎన్నికల సంఘం రూపొందించిన సీ-విజిల్ యాప్ పౌరుల చేతిలో బ్రహ్మస్త్రంగా మారింది. ప్రస్తుతం ఈ యాప్‌ను ఆధునీకరించడంతోపాటు ఫ్లయింగ్ స్కాడ్స్‌తో అనుసంధానం చేశారు. అక్రమాలకు సంబంధించిన ఫొటోలను యాప్‌లో అప్లోడ్ చేస్తే 100 నిమిషాల వ్యవధిలోనే దర్యాప్తు చేసి ఫిర్యాదుదారుడికి తెలియజేస్తారు. ఈ సమాచారం జిల్లా ఎన్నికల అధికారితోపాటు నియోజకవర్గ పరిధిలోని ఫ్లయింగ్ స్కాడ్‌కు చేరుతుంది.
ఎన్నికల్లో రాజకీయ పార్టీల అభ్యర్థులు, నాయకుల అక్రమాలు, కోడ్ ఉల్లంఘనలపై సామాన్య పౌరులు సైతం నేరుగా ఫిర్యాదు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు సీ-విజిల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు. ప్రస్తుతం ఈ యాప్‌ను ఆధునీకరించి, ఫ్లయింగ్ స్వాడ్‌తో అనుసంధానం చేశారు. ఎవరైనా కోడ్ ఉల్లంఘించినా, రాజకీయ పార్టీల అభ్యర్థులు, నాయకులు ఓటర్లకు డబ్బులు, మద్యం, బహుమతులు పంచినా ఆ వివరాలతో నేరుగా ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. అలాగే ఎన్నికల ప్రచార సమయంలో అనుమతులు లేకుండా లౌడ్ స్పీకర్లు వాడినా, ర్యాలీలు తీసినా, నిబంధనలు ఉల్లంఘించినా, కుల, మతాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా ఫిర్యాదు చేసే వెసులుబాటు కల్పించారు.
స్మార్ట్‌ఫోన్ ఉన్న వారు ఈ యాప్‌ను గూగుల్, యాపిల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. ప్లే స్టోర్‌కు వెళ్లి సీ-విజిల్ యాప్ అని టైప్ చేయగా.. 8.41 ఎంబీ ఉన్న యాప్ డౌన్లోడ్ అవుతుంది. యాప్‌ను ఓపెన్ చేసి భాషను ఎంచుకోవాలి. ఆ తరువాత అక్కడ సూచించే వివిధ నిబంధనలను అంగీకరిస్తున్నట్లుగా టిక్ చేయాలి. అనంతరం సీ-విజిల్ ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా అనే యాప్ సెల్‌ఫోన్ స్క్రీన్‌పై కనబడుతుంది. అనంతరం సెల్‌ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి ఎస్ఎంఎస్ ద్వారా నాలుగు నంబర్ల ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేసిన తరువాత వినియోగదారుడికి సంబంధించిన పూర్తి వివరాలు వినియోగదారుడి అడ్రస్, పిన్‌కోడ్, నియోజకవర్గం, జిల్లా, రాష్ట్రం వంటి పూర్తి వివరాలు పొందుపరుచాలి. అనంతరం యాప్ ఓపెన్ అయి ఫొటో, వీడియో, ఆడియో లోగోలు కనిపిస్తాయి. వినియోగదారుడు తన ప్రాంతంలో జరిగిన కోడ్ ఉల్లంఘనలపై ఫొటో లేదా వీడియో, ఆడియో రూపంలో లోగోను బట్టి ఎంచుకుని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ ఫిర్యాదు నేరుగా ఎన్నికల సంఘానికి చేరుతుంది. వారు పరిశీలించిన అనంతరం సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తారు. ఈ యాప్‌లో ఎన్నికల సమయంలో చుట్టుపక్కల జరుగుతున్న కోడ్ ఉల్లంఘనలు పొందుపరుచవచ్చు. ఈ యాప్ ద్వారా ఫిర్యాదు అందిన 10 నిమిషాల వ్యవధిలోనే ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని 100 నిమిషాల వ్యవధిలో చర్యలు తీసుకుంటారు.