మునుగోడు, జనవరి 03 ; మునుగోడు అంబేద్కర్ చౌరస్తాలో సావిత్రీబాయి పూలే 195వ జయంతి ఉత్సవాన్ని బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. సావిత్రీబాయి పూలే చిత్రపటానికి బీసీ సంక్షేమ సంఘం మునుగోడు నియోజకవర్గ అధ్యక్షుడు బూడిద లింగయ్య యాదవ్, స్థానిక సర్పంచ్ పాలకూరి రమాదేవి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం దక్షిణ తెలంగాణ కన్వీనర్ డాక్టర్ తోట నర్సింహ చారి, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బూడిద మల్లికార్జున్ యాదవ్, బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు గుంటోజు వెంకటాచారి, బిసి సంఘం నాయకులు పాలకూరి నరసింహ గౌడ్, ఈదులకంటి కైలాష్ గౌడ్, మిరియాల వెంకన్న, ఆవుల శ్రీనివాస్ యాదవ్, పంతంగి అశోక్, గోపాగోని దిలీప్, నరేష్, లక్ష్మణ్ పాల్గొన్నారు.