తుంగతుర్తి, జనవరి 27 : రావులపల్లి నుండి ఎక్స్ రోడ్ తండా వెళ్లే మెయిన్ రోడ్డు గుంతలు ఏర్పడి ప్రజలు ప్రమాదాలకు గురవుతున్నారని రావులపల్లి సర్పంచ్ చింతకుంట్ల మనోజ్ మంగళవారం మట్టితో గుంతలను పూడ్చి మరమ్మతులు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోడ్డు వల్ల ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడుతుండడంతో తాత్కలికంగా మరమ్మతు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రావులపల్లి సెక్రెటరీ జగదీష్, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.