సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతిని శుక్రవారం ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. సూర్యాపేటలో మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, ఎంపీ బడుగుల, మిర్యాలగూడలో ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు, నకిరేకల్‌లో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పాల్గొన్నారు.
మిర్యాలగూడ, ఆగస్టు 18 : సర్వార్ సర్వాయి పాపన్నగౌడ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు పిలుపునిచ్చారు. శుక్రవారం సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా పట్టణంలోని పాపన్న విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాల వేసి నివాళులర్పించారు. పాపన్న పేద ప్రజల పక్షాన పోరాడిన యోధుడని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు అన్నభీమోజు నాగార్జునాచారి, గుండు శ్రీరాములుగౌడ్, డాక్టర్ రాజు, జేర్రిపోతుల రాములుగౌడ్, వస్కుల మట్టయ్య, తాళ్లపల్లి రవి, వెంకన్న, పాండుగౌడ్, నాగభూషణం, దశరధనాయక్ పాల్గొన్నారు.
మాల్ : చింతపల్లి మండల కేంద్రంతో పాటు కుర్మేడు, గొడకొండ్లలో గౌడ కులస్తులు ర్యాలీ నిర్వహించారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కేక్ కట్‌చేసి స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జై గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు పొలగోని వినోద్‌గౌడ్, కేశగోని రవీందర్‌గౌడ్, బాదెపల్లి నిరంజన్ గౌడ్, నారయ్య గౌడ్, కట్కూరి నారాణగౌడ్, కొప్పుల శ్రీనివాస్‌గౌడ్, కృష్ణగౌడ్, పులిరాజుగౌడ్, శ్రీనివాస్‌గౌడ్, సత్యనారాయణ పాల్గొన్నారు.
హాలియా : కల్లుగీత కార్మిక సంఘం మండల అధ్యక్షుడు కాట్నం యాదగిరిగౌడ్ ఆధ్వర్యంలో శుక్రవారం హాలియాలో సర్వార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు వేములకొండ పుల్లయ్య, యాచారం సర్పంచ్ చెదురుమల్లి రాములు గౌడ్, సైదులు గౌడ్, సత్తయ్య గౌడ్, కాట్నం నాగరాజు గౌడ్, లింగయ్యగౌడ్, ఎల్లయ్యగౌడ్, మహేశ్‌గౌడ్, జనయ్యగౌడ్ పాల్గొన్నారు.
నిడమనూరు : మండల కేంద్రంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్వాయి పాపన్నగౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు కేశబోయిన జానయ్యగౌడ్, ఊట్కూరు సర్పంచ్ నర్సింగ్ విజయ్‌కుమార్, రవి కుమార్‌గౌడ్, నాయకులు అంకతి సత్యం, కొండా శ్రీనివాస్‌రెడ్డి, ముంగి శివమారయ్య గౌడ్, ఆలంపల్లి నరేశ్, కోటయ్య, సైదులు పాల్గొన్నారు.
గుర్రంపోడు : మండల కేంద్రంలో సర్వాయి పాపన్నగౌడ్ ఫ్లెక్సీకి గౌడ సంఘం మండలాధ్యక్షుడు ఐతగోని వెంకటేశం గౌడ్, స్థానిక సర్పంచ్ షేక్ మస్రత్ సయ్యద్‌మియా పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ పగిళ్ల లాలయ్య, గౌడ సంఘం మండల ప్రధాన కార్యదర్శి రావుల సైదులు గౌడ్, గౌడ సంఘం నాయకలు పాల్గొన్నారు.
చండూరు : గట్టుప్పల్ మండల కేంద్రంలోని చౌరస్తాలో గౌడ యువజన సంఘం అధ్యక్షుడు పెద్దగోని రాఘవేంద్రగౌడ్ ఆధ్వర్యంలో పాపన్నగౌడ్ ఫ్లెక్సీకి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల కమిటీ సభ్యుడు కర్నాటి అబ్బయ్య గౌడ్, గౌడ సంఘం ప్రధాన కార్యదర్శి బొల్లేపల్లి వెంకటేశం గౌడ్, మాదగాని గోపాల్ గౌడ్, భీమగాని యాదయ్య గౌడ్, బోడ శంకరయ్య గౌడ్, నాయకులు భీమగాని మల్లేశ్‌గౌడ్, పెద్దగోని నరేందర్ గౌడ్ పాల్గొన్నారు.
మర్రిగూడ : గౌడ సంఘం ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని పాపన్నగౌడ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు కుక్కడపు ముత్యాలు గౌడ్, మండలాధ్యక్షుడు పందుల రాము లు గౌడ్, బీసీ సంక్షేమ సంఘం మండలాధ్యక్షుడు చెర్కు శ్రీరాములు గౌడ్, జమ్ముల వెంకటేశ్, కొంపెల్లి నాగరాజు, గునగంటి శ్రీరాములు గౌడ్, కేశవులు గౌడ్, రాచకొండ యాదయ్య, సుంకరి మల్లేశ్, వల్లపు భాస్కర్, అంబల్ల రవి, కోటి వెంకటేశ్ గౌడ్, నాయకులు పాల్గొన్నారు.
మునుగోడు : మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో పాపన్నగౌడ్ ఫెక్సీకి గౌఢసంఘం నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు అనంత శ్రీనువాస్‌గౌడ్, బొడ్డు రవి, మహేశ్‌గౌడ్, జనగాం అంజయ్య, వేముల లింగస్వామిగౌడ్, మాదగోని రుషికేశ్గౌడ్, మాదాసు నరిసింహ, పాలకూరి వెంకన్న, పాలకూరి ఆశోక్, బొడ్డు చంద్రమౌళి, శ్రీకాంత్‌గౌడ్, యడవల్లి సురేశ్‌కుమార్ పాల్గొన్నారు.
కట్టంగూర్ : మండలంలోని పరడ, బొల్లేపల్లి, కట్టంగూర్, ఈదులూరు గ్రామాల్లో బీఆర్ఎస్, గౌడ్ సంఘం, గీత పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో సర్వాయి పాపన్న విగ్రహానికి మాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పోగుల నర్సింహ, నాయకులు పెద్ది బాలనర్సయ్య, కొంపెల్లి యాదయ్య, అంతటి శ్రీను, చౌగోని జనార్దన్, కానుగు లింగయ్య, లక్ష్మణ్, సైదులు పాల్గొన్నారు.
శాలిగౌరారం : మండలంలోని ఆకారం గ్రామంలో పాపన్న ఫ్లెక్సీకి బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఐతగోని వెంకన్నగౌడ్ పూలమాల వేసి నివాళులర్పించారు. మనిమద్దె గ్రామంలో కోటగిరి రమేశ్ ఆధ్వర్యంలో పాపన్న జయంతి నిర్వహించారు. ఐతగోని సత్తయ్య, సైదులు, మహేశ్, బోయపెల్లి లింగస్వామి, హరీశ్, సైదులు, శ్రీను పాల్గొన్నారు.
సర్వాయి పాపన్న పోరాటం స్ఫూర్తిదాయకం : కలెక్టర్ ఆర్వీ కర్ణన్
నీలగిరి : అణచివేతకు గురవుతున్న పేద ప్రజల కోసం సర్దార్ సర్వాయి పాపన్న చేసిన వీరోచిత పోరాటం స్ఫూర్తిదాయకమని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అన్నారు. సర్దార్ సర్వా యి పాపన్న 373వ జయంతి ఉత్సవాల సందర్భంగా శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో పాపన్న చిత్ర పటానికి కలెక్టర్ పూల మాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఆదనపు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, మార్కెట్ కమిటీ చైర్మన్ చీర పంకజ్ యాదవ్, బీసీ సంక్షేమశాఖ అధికారి ఖాసీం అలీ అప్సర్, నాయకులు కటికం సత్తయ్య గౌడ్, లొడంగి గోవర్ధన్, సుంకరి మల్లేశ్‌గౌడ్ పాల్గొన్నారు.