నకిరేకల్, మే 29 : ఈ నెల 25న TS29TB 3851 నంబర్ గల ఆర్టీసి బస్సు సూర్యాపేట నుండి హైదరాబాద్‌కు వెళ్తుంది. ఆ బస్సులో సూర్యాపేటకు చెందిన రామిశెట్టి శాంతకుమారి అనే మహిళ ప్రయాణిస్తుంది. హైదరాబాద్ చేరుకోగానే మహిళ బస్సులో బ్యాగ్ మరిచి దిగి వెళ్లిపోయింది. గమనించిన నకిరేకల్ పట్టణంలోని రహమత్‌నగర్‌కు చెందిన బస్సు డ్రైవర్ పాషా, కండక్టర్ అంజయ్య బ్యాగ్‌ను తెరిచి చూడగా అందులో 6 తులాల బంగారం, మొబైల్, కొంత డబ్బు ఉన్నది. వెంటనే వారు డిపో మేనేజర్‌కు తెలిపి సదరు ప్రయాణికురాలికి బ్యాగ్ అందజేశారు. విషయం తెలిసిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఇంతటి నిజాయితీ చూపని డ్రైవర్, కండక్టర్‌ను హైదరాబాద్‌లోని బస్ భవన్‌కు పిలిచి సన్మానించి అభినందించారు.