నీలగిరి, జూలై 19: జాతీయ రహదారి 565 విస్తరణలో భాగంగా పానగల్లు నుంచి సాగర్ రోడ్డు వరకు భూములు కోల్పోతున్న బాధితులకు నష్టపరిహారం చెల్లించిన తరువాతే పనులు చేపట్టాలని భూ నిర్వాసితుల పోరాట కమిటీ గౌరవాధ్యక్షుడు సయ్యద్ హశం, కో కన్వీనర్లు దోనాల నాగార్జున రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వాసితులు పనులను అడ్డుకున్నారు. సుమారు రెండువందల మంది నిర్వాసితులు శనివారం గిరకబాయిగూడెం హౌసింగ్ బోర్డు మధ్యలో ఉన్న కాంట్రాక్టర్ క్యాంపు కార్యాలయం వద్దకు వెళ్లి వాహనాలు బయటకు రాకుండా అడ్డుకున్నారు.
తమకు న్యాయం జరిగే వరకు పనులు నిలిపివేయాలంటూ నినాదాలు చేశారు. దీంతో క్యాంపు కార్యాలయ మేనేజర్ సత్యం వారి వద్దకు వచ్చి అందోళన విరమించాలని విజ్ఞప్తి చేశారు. నష్టపరిహారం తమపరిధిలోని అంశం కాదని చెబుతూ వారితో చర్చలు జరిపారు. సుమారు 14 కిలోమీటర్ల బైపాస్ రోడ్డు నిర్మాణంలో భూ ములు కోల్పోతున్న నిర్వాసితులకు పూర్తి నష్టపరిహారం చెల్లించిన తర్వాతనే రోడ్డు పనులు ప్రారంభించాలని బాధితులు కోరారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మారెట్ రేటుకు అదనంగా నిర్వాసితులకు నష్టపరిహారం ఇప్పిస్తానని హామీ ఇచ్చారని వారు గుర్తు చేశారు.
కలెక్టర్ మంత్రి హామీ మేరకు సుమారు 14 కిలోమీటర్ల పరిధిలో 1250 మంది నిర్వాసితులు ఉన్నట్లు గుర్తించారన్నారు. రోడ్డు నిర్మాణ విషయంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని అయితే తమకు తగిన నష్టపరిహారం అందజేసి పనులు ప్రారంభించాలన్నారు. ప్రస్తు తం ఆ భూముల్లో పంటలు వేసుకున్నామని, భూమితో పాటు పంట నష్టం జరగకుండా బాధితులందరికీ పూర్తి నష్టపరిహారం అందజేయాలన్నారు. ఈ లోగా పంటలు కూడా పూర్తవుతాయని ఆ తర్వాత రోడ్డుపనులు ప్రారంభించాలని కోరా రు.
పరిహారం ఇచ్చిన తర్వాతే, నిర్మాణ పనులు ప్రారంభిస్తామని, అంతవరకు ఏ ఒక రైతు భూమిలో కూడా రోడ్డు వేయబోమంటూ కాంట్రాక్టర్ హామీ ఇవ్వడంతో నిర్వాసితులు ఆం దోళన విరమించారు. కార్యక్రమంలో నిర్వాసితుల పోరాట కమిటీ గౌరవ సలహాదారులు దండెంపల్లి సత్తయ్య, మాజీ కౌన్సిలర్ ఊటూరి వెంకట్ రెడ్డి, కోశాధికారి కన్నయ్య, కమిటీ సభ్యులు బొజ్జ మహేశ్, లింగారెడ్డి, ఊటూరి నారాయణరెడ్డి, యాదగిరిరెడ్డి, జగన్, నర్సిరెడ్డి, కిరణ్, శ్రీనివాస్‌రెడ్డి, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.