యాదాద్రి భువనగిరి, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): ఫార్మా, పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికుల ప్రాణాలు గా ల్లో దీపంలా మారాయి. రోజంతా చమట చిందించి అరకొర జీతాలకు పనిచేస్తున్న లేబర్ పరిస్థితి దినదిన గం డంగా మారింది. ఎప్పుడు ఏ మూల నుంచి మృత్యువు ముంచుకొస్తుందోనని బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. ఇటీవల యాదాద్రి భువనగిరి జిల్లాలో నిత్యం పేలుళ్లు సంభవించి ప్రాణాలు పోతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. తాజాగా ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్ లో పేలుడులో ఒకరు చనిపోయి న విషాద ఘటన చోటుచేసుకుంది.
యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి, బీబీనగర్, యాదగిరిగుట్ట, చౌటుప్పల్, బొమ్మలరామారం తదితర మండలాల్లో పెద్ద ఎత్తు న ఫార్మా పరిశ్రమలు ఉన్నాయి. జిల్లాలో సుమారు 100 కి పైగా రసాయన పరిశ్రమలు నడుస్తున్నాయి. కానీ కంపెనీల్లో భద్రతపై సర్వత్రా చర్చ కొనసాగుతున్నది. జిల్లాలోని పేలుడు, ఫార్మా కంపెనీల్లో తరుచూ బ్రాయిలర్లు, రియాక్టర్లు పేలి ప్రమాదాలు జరిగి కార్మికులు ప్రా ణాలు గాల్లో కలుస్తున్నాయి. చాలాచోట్ల నైపుణ్యం లేని కార్మికులను రియాక్టర్ల వద్ద పనిచేయిస్తుండటంతో ఇలాం టి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.
తనిఖీల్లేవ్.. పర్యవేక్షణ లేదు..
పరిశ్రమలపై అధికారుల పర్యవేక్షణ కొరవడింది. భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నాయా లేదా అని తనిఖీలు చేయాల్సిన అధికారులు ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే హడావుడి చేసి వదిలేస్తున్నారు. ఆ తర్వాత పరిస్థితి మళ్లీ ఎప్పటి లాగానే ఉంది. వాస్తవానికి ప్రతి మూడు నెలలకోసారి తనిఖీలు చేపట్టాలి. ఈ ఏడాది ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్ కంపెనీలో మూడుసార్లు పేలుడు సంభవించడం విశే షం. అంతకుముందు ఇదే కంపెనీలో 2012, 2019, 2020లోనూ ప్రమాదాలు జరిగి పలువురు ప్రా ణాలు కోల్పోయారు. ప్రమాదాలు జరిగిన సమయంలో ప్రజాప్రతినిధుల జేబులు మాత్రం నిండుతున్నాయనే ప్రచా రం జరుగుతుంది. ఇటీవల ఓ కంపెనీలో పేలుడు సందర్భంగా ప్రజాప్రతినిధులకు కోట్లు ముట్టాయనే ఆరోపణలు ఉన్నాయి.
కంపెనీలో ప్రమాదం.. కార్మికుడి మృతి
యాదగిరిగుట్ట, ఆగస్టు 12: పెద్దకందుకూరులోని పీఈఎల్లో మంగళవారం ఉదయం సుమారుగా 7.30 గంటల ప్రాంతంలో కంపెనీలోని బ్రాయిలర్‌కు చెందిన స్టీమ్ వాల్వ్‌ను తెరిచే క్రమంలో ఒక్కసారిగా తీవ్ర ఒత్తిడి పెరిగి అక్కడే విధుల్లో ఉన్న కార్మికుడు సదానందం(50) తలకు బలంగా తగలడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. తొటి కార్మికుల సహాయంతో భువనగిరి జిల్లా దవాఖానకు తరలించగా అప్పటికే మృతి చెందిన్నట్లు వైద్యులు ధ్రువీకరించారు. గోదావరిఖనికి చెందిన ఆయన 25 ఏండ్ల క్రితం కంపెనీకి బదిలీపై వచ్చి ఆలేరులో నివాసమంటున్నాడు. ఇతడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నాడు. ఘటనాస్థలిని ఏసీపీ శ్రీనివాస్‌నాయుడు, సీఐ భాస్కర్ సందర్శించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
కార్మిక కుటుంబానికి రూ.1.20 కోట్ల పరిహారం, ఒకరికి ఉద్యోగం
మృతి చెందిన కార్మికుడు సదానందం కుటుంబానికి బీఆర్ఎస్కేవీ అండగా ఉంటుందని బీఆర్ఎస్కేవీ పీఈఎల్ విభాగం కంపెనీ అధ్యక్షుడు గొంగిడి మహేందర్‌రెడ్డి అన్నారు. మంగళవా రం దవాఖానలో కార్మికుడి మృతదేహాన్ని సందర్శించారు. అనంతరం కార్మిక సంఘాలతో కలిసి యాజమాన్యంతో మాట్లాడారు. రూ.1.20 కోట్ల నష్టపరిహారంతో పాటు కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం కల్పించేలా ఒప్పందం జరిగిందన్నారు. ఇటీవల కార్మికులు మృత్యువాతపడటం ఆందోళన కలిగిస్తుందన్నారు. పనిచేసే సమయంలో జాగ్రత్తలు పాటించాలన్నారు.
పలు సంఘటనలు..