కట్టంగూర్, సెప్టెంబర్ 29 : తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక సద్దుల బతుకమ్మ పండుగను మహిళలు సోమవారం భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. కట్టంగూర్, అయిటిపాముల, ఈదులూరు, పామనుగుండ్ల, కురుమర్తి, మునుకుంట్ల, పరడ, గ్రామాల్లోని మహిళలు పలు రకాల బత్తుకమ్మలను పేర్చి ప్రధాన కూడళ్ల వద్ద ఉంచి బతుకమ్మ పాటలను పాడి, ఆటలు ఆడారు. అనంతరం ఆయా గ్రామాల చెరువులలో నిమజ్జనం చేశారు. ఉత్తమ బతుకమ్మలను పేర్చిన వారికి లయన్స్ క్లబ్ కట్టంగూర్ కింగ్స్ సభ్యులు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ కట్టంగూర్ కింగ్స్ అధ్యక్షుడు చిక్కు శేఖర్, ప్రధాన కార్యదర్శి గుడిపాటి శివప్రసాద్, కోశాధికారి పోగుల రాములు, ఉపాధ్యక్షులు రెడ్డిపల్లి సాగర్, మహిళలు పాల్గొన్నారు.
పెన్పహాడ్ : పెన్పహాడ్ మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో సోమవారం సాయంత్రం సద్దుల బతుకమ్మ పండుగ సంబరాలు ఘనంగా నిర్వహించారు. తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి, సాంప్రదాయ పాటలతో మహిళలు పండుగ జరుపుకున్నారు. పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని ఆట పాటలతో బతుకమ్మలు ఆడారు. ఇంటింటి నుండి బతుకమ్మలు తీసి గ్రామ చెరువులో నిమజ్జనం చేశారు.
Nalgonda : భక్తి శ్రద్ధలతో ఘనంగా సద్దుల బతుకమ్మ