Bhu Bharati Act | గట్టుప్పల్, ఫిబ్రవరి 12 : భూ భారతి చట్టం ద్వారా సాదా బైనామాలు, వాటి అమలు వేగవంతం అవుతాయని వ్యవసాయ భూమీ చట్టాల నిపుణులు, న్యాయవాది భూమి సునీల్ (Bhumi Sunil Kumar) కుమార్ అన్నారు. భూ భారతి నూతన చట్టం, విత్తన చట్టాలపై మండలం పరిధిలోని నామాపురం గ్రామంలో ఇవాళ లీప్స్, గ్రాస్ సుచింత సంస్థల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న భూభారతి చట్టం, విత్తన చట్టాలు, వ్యవసాయ చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సదస్సుకు ప్రస్తుత వ్యవసాయ భూ భారతి చట్టం రూపకల్పన కమిటీ సభ్యులైన భూమి సునీల్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా భూమి సునీల్ కుమార్ మాట్లాడుతూ.. గత 24 సంవత్సరాలుగా భూమి హక్కులపైన వాటి అమలుపైన అనేక పోరాటాలు చేస్తూ వచ్చామన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తరువాత ధరణి చట్టం ఏర్పడినది.
పేదలకు భూమిపై హక్కు ఉండటానికి భూ భారతి చట్టంలో అనేక మార్పులు చేర్పులు చేశామని చట్టం అమలుకు తహశీల్దార్, ఆర్డీవోకు ప్రత్యేక అధికారాలను పొందుపరచబడ్డాయన్నారు. భూ భారతి చట్టం ద్వారా సాదా బైనామాలు వాటి అమలు వేగవంతం అవుతుందని తెలిపారు. ఈ చట్టం తేవడానికి భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో భూ చట్టాలను పరిశీలించి అధ్యయనం చేసి.. భూ భారతి చట్టాన్ని రూపకల్పన చేశామని అన్నారు.
పేదలకు ఉపయోగకరంగా..
భూ భారతి చట్టంలో ఎంతో నైపుణ్యం కలిగిన విజ్ఞానవంతులు ఉన్నారని చట్టం అమలు చేయడానికి ఎలాంటి లొసుగులు జరగకుండా చట్టం ఏర్పడిందని తెలిపారు. ఈ చట్టం పేదలకుఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. జీవన్ కుమార్ హైకోర్టు సీనియర్ న్యాయవాది మాట్లాడుతూ.. భూ భారతి చట్టం ద్వారా పేద రైతులకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు.
గ్రామాభివృద్ధి సేవా సమితి (గ్రాస్) స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు డాక్టర్ కంచుకట్ల సుభాష్ మాట్లాడుతూ.. మారుమూల ప్రాంతాలలో భూ హక్కులపై, విత్తన చట్టాలపైన రైతులు వివిధ సమస్యలపైన ఇలాంటి అవగాహన కార్యక్రమాలు ఎంతో ఉపయోగ పడుతున్నాయని..అందులో భూమి సునీల్ రామాపురం గ్రామానికి రావడం ఎంతో సంతోషకరమని.. వారి అమూల్యమైన సందేశం గ్రామీణ పేద ప్రజలకు ఉపయోగపడుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ సోషల్ మీడియా కన్వీనర్ కరుణాకర్ దేశాయ్, మాజీ సర్పంచ్ కంచుకట్ల సంపత్, మహేశ్వరం సతీష్, పగడాల లింగయ్య, గొట్టిముక్కుల ప్రకాష్ రామకృష్ణయ్య కంచుకట్ల యాదయ్య జాజుల యాదయ్య, ఈద శేఖర్ సురిగి వెంకటేష్, భీమనపల్లి రాములు మాజీ ఉపసర్పంచ్, దేవనపల్లి ధర్మయ్య, నడ్డి లచ్చయ్య, జనగాం యాదయ్య, జంగయ్య తదితరులు పాల్గొన్నారు.
Hyderabad | మూసీ పరిసరాల్లో మళ్లీ కూల్చివేతలు.. భయాందోళనలో జనం
Mythological Drama Competitions | పౌరాణిక నాటక పోటీలకు బ్రోచర్ ఆవిష్కరణ
Maha Kumbh Mela | మాఘ పౌర్ణమి.. 1.83 కోట్ల మంది పుణ్యస్నానాలు