ఆలేర్ టౌన్, మార్చి 7 : మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని శ్రీ రుద్రమదేవి మహిళా మ్యాక్స్ సొసైటీ సీఈవో కవిత అన్నారు. ఆలేరు పట్టణ కేంద్రంలో అంతర్జాతీయ మహిళా వారోత్సవాల్లో భాగంగా శ్రీ రుద్రమదేవి మహిళా మ్యాక్స్ సొసైటీ ఆధ్వర్యంలో మహిళలకు క్రీడా పోటీలు నిర్వహించారు. అనంతరం గెలుపొందిన మహిళలకు బహుమతులు అందజేశారు.
ఈ సందర్భంగా సీఈవో పోగుల కవిత మాట్లాడుతూ.. మానవ సృష్టికి జీవం పోసేది స్త్రీ అని అన్నారు. ఇల్లాలు చదువుకుంటే కుటుంబం బాగుపడుతుంది.. మహిళలు చదువుకుంటే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. మహిళలను చైతన్య పరచడం కోసమే శ్రీ రుద్రమదేవి మహిళా మ్యాక్స్ సొసైటీ ఏర్పాటు చేయడం జరిగిందని గుర్తు చేశారు. ఎండను సైతం లెక్కచేయకుండా వివిధ గ్రామాల నుంచి వచ్చి క్రీడా పోటీలో పాల్గొనడం హర్షనీయమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ దేవర సుజాత, ఆలేరు ఏరియా బోర్డ్ డైరెక్టర్ గడ్డం విజయ, ఆలేరు బ్రాంచ్ మేనేజర్ కొల్లూరి సుజాత, ఆలేరు ఏరియా సూపర్వైజర్ చింతకింది ఉషశ్రీ, ఆలేరు ఏరియా బ్రాంచ్ స్టాఫ్ కాశిరోజు మాధవి, దూడల లావణ్య, మిట్టపల్లి సంతోష, చెక్కిల యమునా, మంగళపల్లి స్వాతి, బేతి సుకన్య, వివిధ గ్రామాల నుంచి వచ్చిన పాలకవర్గ సభ్యులు, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.