– నల్లగొండ డీఎంకు చండూరు మున్సిపల్ చైర్మన్ వినతి
చండూరు, మే 06 : చండూరుకు వచ్చే ఆర్టీసీ బస్సులన్నీ చండూరు మున్సిపల్ కేంద్రంలోని వాటర్ ట్యాంక్ వద్దకు రావాలని కోరుతూ నల్లగొండ డిపో మేనేజర్ రమణకు చండూరు మున్సిపాలిటీ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు బుధవారం వినతి పత్రం అందజేశారు. చండూరు మున్సిపాలిటీలోని ఆర్టీసీ బస్టాండుకు ప్రతిరోజు అనేక బస్సులు తిరుగుతుంటాయని, అందులో కొన్ని బస్సులు నల్లగొండ నుండి చండూరుకు వచ్చే లోకల్ బస్సులు చండూరు బస్టాండ్ లోనే ప్రయాణికులను దింపుతున్నాయని, చండూరు బస్టాండ్ టౌన్ కు దూరంగా ఉంటుందని, కావున ప్రయాణికులకు ఇబ్బంది అవుతుందన్నారు.
లోకల్ బస్సులన్నీ చండూరు పట్టణ కేంద్రంలోని వాటర్ ట్యాంక్ దగ్గరికి వచ్చి దింపాలని, ఉదయం నల్లగొండకు వెళ్లే బస్సులు వాటర్ ట్యాంక్ దగ్గరకు వచ్చి ప్రయాణికులను ఎక్కించుకొని వెళ్లాలని ఆయన కోరారు. దీనిపై స్పందించిన నల్లగొండ డిపో మేనేజర్ రమణ రెండు రోజుల్లోనే సమస్య పరిష్కారం అవుతుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కటకం రమేష్, బుషిపాక వాసు, కో ఆప్షన్ మెంబర్ కల్లెట్ల చంద్రకళ మారయ్య, గజ్జల కృష్ణారెడ్డి, బోడ విజయ్ పాల్గొన్నారు.