వేంకటేశ్వరాలయానికి రూ.6కోట్లు మంజూరు
పట్టణంలోని గరుడాద్రి వేంకటేశ్వర ఆలయ నిర్మాణానికి స్పెషల్ ఫండ్ నుంచి రూ.6కోట్లు మంజూరు చేయడాన్ని హర్షిస్తూ ఆలయ కమిటీ సభ్యులు సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి శుక్రవారం క్షీరాభిషేకం చేశారు.
- సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి ఆలయ కమిటీ క్షీరాభిషేకం
దేవరకొండ, జనవరి 20 : పట్టణంలోని గరుడాద్రి వేంకటేశ్వర ఆలయ నిర్మాణానికి స్పెషల్ ఫండ్ నుంచి రూ.6కోట్లు మంజూరు చేయడాన్ని హర్షిస్తూ ఆలయ కమిటీ సభ్యులు సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి శుక్రవారం క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు, మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహ మాట్లాడుతూ సుమారు రూ.15 కోట్ల వ్యయంతో గరుడాద్రి ఆలయ నిర్మిస్తున్నట్లు తెలిపారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే రవీంద్రకుమార్ సహకారంతో స్పెషల్ ఫండ్ నుంచి రూ.6కోట్ల నిధులు మంజూరు చేసినందుకు ఆలయ కమిటీ తరపున సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఆలయ నిర్మాణానికి శాసనమండలి చైర్మన్ గతంలో రూ.25లక్షలు సొంత నిధులు ఇచ్చినట్లు తెలిపారు. ఈ నిధులు గాక దాతల సహకారంతో ఆలయ నిర్మాణాలు పూర్తి చేసి జిల్లాలోనే దేవరకొండలో అద్భుతమైన గరుడాద్రి వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మిస్తామన్నారు. 180మంది సభ్యుల సహకారంతో పనులు పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో ప్రధాన కార్యదర్శి దొడ్డి అశోక్, కోశాధికారి శిరందాసు కృష్ణయ్య, కార్యనిర్వాహక అధ్యక్షుడు బొడిగె రవీందర్‌గౌడ్, ఉపాధ్యక్షులు పానుగంటి మల్లయ్య, చీదెళ్ల వెంకటేశ్వర్లు, దొడ్డి వెంకటేశ్వర్లు, ఇమ్మడి భద్రయ్య, సభ్యులు నీల బుచ్చయ్య, నక్క వెంకటేశ్‌యాదవ్, కర్నాటి పురుషోత్తం, కుంచకూరి లక్ష్మణ్, విజయకుమార్, నరేందర్, నారాయణ, ఎల్లయ్య, రామాచారి, శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ దేవేందర్‌నాయక్ పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

