దేవరకొండ, అక్టోబర్ 23 : దేవరకొండ నియోజకవర్గ అభివృద్ధికి గిరిజన సంక్షేమ శాఖ అలాగే హ్యమ్ పథకం నుండి సుమారు రూ.460 కోట్ల నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ తెలిపారు. గురువారం దేవరకొండ పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. దేవరకొండ నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో సీసీ రోడ్లు, బీటీ రోడ్లకు గాను గిరిజన సంక్షేమ శాఖ నుండి సుమారు రూ.28 కోట్లు, అదేవిధంగా హ్యమ్ పథకం నుండి రూ.327 కోట్లు నిధులు మంజూరైనట్లు చెప్పారు. త్వరలో ఆయా పనులకు టెండర్లు పిలిచి పనులను ప్రారంభిస్తామని తెలిపారు.
దేవరకొండ, చందంపేట, నేరేడుగొమ్ము, చింతపల్లి, ఉండమల్లేపల్లి, గుళ్లపల్లి మండలంలోని వివిధ గ్రామాల్లో సీసీ రోడ్లతో పాటు బీటీ రోడ్లు సైతం త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. అదేవిధంగా దేవరకొండ రోడ్డు వయా దిండి రోడ్డు నుండి శ్రీశైలం మెయిన్ రోడ్డు వరకు, కొండమల్లేపల్లి నుండి ధర్వేశిపురం వరకు, గుంటుపల్లి నుండి కంబాలపల్లి వరకు బీటి రోడ్డు పనులకు మరమ్మతులు చేపట్టనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పనులపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని తెలిపారు ఈ సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నరసింహ, ముత్యాల సర్వయ్య, వెంకటయ్య గౌడ్, గోవింద్ యాదవ్, బిక్కు నాయక్, కుర్ర రామ్ సింగ్, మల్లారెడ్డి, యూనిస్, బాబురామ్ నాయక్ పాల్గొన్నారు.