పెన్‌పహాడ్, జూలై 15 : తన అసభ్య పదజాలంతో సీఎం పదవిని రేవంత్‌రెడ్డి దిగజార్చుతున్నట్లు మాజీ ఎంపీపీ నెమ్మాది భిక్షం, బీఆర్ఎస్ పెన్‌పహాడ్ మండలాధ్యక్షుడు దొంగరి యుగేందర్ అన్నారు. మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డిపై తిరుమలగిరి సభలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడిన మాటలను వారు ఖండించారు. మంగళవారం మండల పరిధిలోని అనంతారం అడ్డరోడ్డు వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. బీఆర్ఎస్ కార్యకర్తలు తలచుకుంటే కాంగ్రెస్ నేతలు ప్రజాక్షేత్రంలో తిరగలేరన్నారు.
తాను ముఖ్యమంత్రిని అని మరచిపోయి రేవంత్ మాట్లాడుతున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంను ఎవరు అభివృద్ధి చేశారో ప్రజలకు తెలుసన్నారు. ఎస్సారెస్పీ చివరి ఆయకట్టు భూములలో కూడా నీరు జాలుగా పొంగి పొర్లి గడ్డి కూడా పుట్టని చోట జమ్ము పుట్టించిన వ్యక్తి జగదీశ్ రెడ్డి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల ఉపాధ్యక్షుడు దంతాల వెంకటేశ్వర్లు, మాజీ సర్పంచ్ నెమ్మది నగేశ్, మండల నాయకులు పొదిలా నాగార్జున, దాచేపల్లి సుధాకర్, నారాయణ రెడ్డి, ధర్మయ్య, దాసరి శ్రీనివాస్, మేకల విజయ్ పాల్గొన్నారు.