యాదగిరిగుట్ట, జూన్ 7: కాళేశ్వరం ఎత్తిపోతల పథకం 15వ ప్యాకేజీ టెయిల్ఎండ్ భాగంగా నిర్మితమైన గంధమల్ల జలాశయ రూపశిల్పి కేసీఆరేనని, 100 ఎంబీబీఎస్ సీట్ల సామర్థ్యంతో స్వామివారి పేరిట యాదగిరిగుట్టకు వైద్య కళాశాలను మంజూరు చేసిన ఘనత రాష్ట్ర తొలిసీఎం కేసీఆర్‌కే దక్కుతుందని టెస్కాబ్ మాజీ వైస్ చైర్మన్, బీఆర్ఎస్ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. శనివారం యాదగిరిగుట్ట బీఆర్ఎస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డిపై విరుచుకుపడ్డాడు.
కాళేశ్వరం ఎత్తిపోతల ఫథకంలో భాగంగా ఆలేరు నియోజకవర్గానికి సాగుజలాలు అందించాలన్న లక్ష్యంతోనే 2019 ఫిబ్రవరిలోనే 9.8 టీఎంసీ సామర్థ్యంతో ప్రతిపాదించారని అన్నారు. అనంతరం భూ సేకరణ సమస్య రావంతో 4.2 టీఎంసీకి కుదించడంతోపాటు గ్రామస్తుల కోరిక మేరకు రీడిజైన్ చేసి 1.41 టీఎంసీ కుందించి నిర్మాణ పనులు చేపట్టాలని పరిపాలన అనుమతులతోపాటు నిధులు కూడా మంజూరయ్యాయని స్పష్టం చేశారు. నిర్మాణ పనులు కాంట్రాక్టు అప్పగించారని తెలిపారు.
కాంట్రాక్టు పనులు గుత్తా అమిత్‌రెడ్డి దుక్కించుకొని పనులు ప్రారంభిస్తే కాంగ్రెస్ నాయకులు అడ్డుపడి ప్రాజెక్టు పనులు జరుగకుండా చేశారన్నారు. కాళేశ్వరం కూలిపోయిందని అబద్ధ్దాలు చెప్పిన రేవంత్‌రెడ్డి గంధమల్లకు ఎలా నీళ్లు తీసుకువస్తారో చెప్పాలన్నారు. ఎల్లంపల్లి, ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుల నుంచి గంధమల్లకు సాగునీళ్లు తీసుకువస్తారని చెప్పిన రేవంత్‌రెడ్డి సాగు జలాలు మీద అవగాహనలేదన్నది స్పష్టమవుతుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మితమైన మల్లన్నసాగర్ నుంచే గంధమల్లకు జలాలు వస్తాయన్నారు.
మళ్లీ శంకుస్థాపన చేయడానికి సిగ్గుండాలే..
ప్రభుత్వ హయాంలో శంకుస్థాపనలు చేసిన పనులను తిరిగి శం కుస్థాపనలు చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డికి సిగ్గుండాలన్నారు. కొలనుపాక, కాల్వపల్లి హై లేవల్ బ్రిడ్జి నిర్మాణపు పనులకు మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీత శంకుస్థాపన చేశారన్నారు. ఆలేరు కు రూ.1051.45 కోట్ల పనులను తీసుకువచ్చామని ఎమ్మెల్యే అయిలయ్య ప్రచార ఆర్భాటమేనని గుర్తుచేశారు. ఇందులో కేవ లం రూ.200 కోట్ల ఇంటిగ్రెటెడ్ రెసిడెన్సియల్ స్కూల్ మిన హా మిగతా పనులన్నీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంజూరు చేసివేనని అన్నారు. యాదగిరిగుట్ట దేవస్థానాన్ని కేసీఆర్ రూ.1300 కోట్ల తో పునర్నించారని గుర్తు చేశారు. స్వామివారి విమా న గోపురం స్వర్ణతాపడం పనులు గత ప్రభుత్వమే చేపట్టడంతో పాటు సుమా రు 100 కిలోల బంగారాన్ని సమకూర్చారని స్పష్టం చేశారు.