చందంపేట, (దేవరకొండ), జూలై 17: తెలంగాణ రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలను తాకట్టు పెట్టేలా సీఎం రేవంత్‌రెడ్డి గురుదక్షిణగా గోదావరి జలాలను బనకచర్ల రూపంలో ఆంధ్రకు తరలించే అవకాశం కల్పిస్తున్నారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మా జీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ ధ్వజమెత్తారు. గురువారం దేవరకొండలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబుతో ఉన్న సాన్నిహిత్యంతో సీఎం రేవంత్‌రెడ్డి మిలాఖతై బనకచర్లపై ఢిల్లీలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఆధ్వర్యంలో రహస్యంగా మంతనాలు జరిపారని ఆరోపించారు.
బనకచర్లపై ఎలాంటి చర్చ జరగలేదని రేవంత్‌రెడ్డి పేర్కొనడం హాస్యాస్పదమన్నారు. గోదావరి జలాల్లో ఇరు రాష్ర్టాల వాటా తేలకముందే ఏపీలోని బనకచర్ల నిర్మాణం సబబు కాదన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు ఫోన్ చేశారో లేదా.. ఢిల్లీ పెద్దలు ఫోన్ చేశారో.. తెలియదు కానీ హుటాహుటిన రేవంత్ ఢిల్లీ వెళ్లి భేటీలో పాల్గొన్నారని ఆరోపించారు. బనకచర్లను ఒప్పుకోవడమంటే తెలంగాణ రైతాంగాన్ని ధోకా చేయడమేనని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నదీ జలాలను పరిష్కరించకపోగా కొత్త సమస్యలను తెచ్చి పెడుతోందని ఆరోపించారు.
నదీ జలాలను రెండు రాష్ర్టాలకు పంపిణీ చేయాలని తెలంగాణ కోరుతూ వస్తున్నా కేంద్రం పట్టించుకోకపోవడం శోచనీయమని అన్నారు. కేంద్రలో ప్రభుత్వానికి సహకరిస్తున్న చంద్రబాబు తెలంగాణకు నష్టం కలిగించేలా వ్యవహరిస్తున్నారన్నారు. బనకచర్లపై పోరాటానికైనా సిద్ధమన్న రేవంత్‌రెడ్డి ఏపీ సీఎంకు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు.
రాబోయే కాలంలో జల దోపిడీపై బీఆర్ఎస్ ఉద్యమం చేస్తుందని అన్నారు. గోదావరి, కృష్ణలో నీరు పుష్కలంగా ఉన్నా గోదావరి జలాలను తరలించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. దీంతో తెలంగాణ రైతాంగానికి తీవ్ర నష్టం కలుగుతుందన్నారు. సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు టీవీఎన్ రెడ్డి, వల్లపురెడ్డి, సీనియర్ నాయకులు గాజుల ఆంజనేయులు, ఏసోబు, జర్పుల లోక్యానాయక్, రవీందర్ నాయక్, రమేష్, తరి గోవర్దన్, మోహన్‌కృష్ణ, రమేష్ నాయక్, గుండాల వెంకటయ్య, సైదులు తదితరులు పాల్గొన్నారు.
ఫుడ్‌పాయిజన్ ఘటనలు దురదృష్టకరం..
ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు దురదృష్టకరమని రవీంద్రకుమార్ అన్నారు. గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇటీవల కాలంలో చందంపేట కేజీబీవీ, పీఏపల్లి కేజీబీవీలో ఫుడ్ పాయిజన్, దేవరకొండ మోడల్ స్కూ ల్లో ఎలుకలు కొరికిన ఘటనలు చోటు చేసుకోవ డం దారుణమన్నారు. తాజాగా ముదిగొండ ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్‌తో 27 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారని అన్నారు. ఫుడ్ పా యిజన్ ఘటనలు జరగుతున్నా అధికారులు, ప్రభుత్వం చోద్యం చూ స్తున్నాయన్నారు. కాం ట్రాక్టర్లకు బిల్లులు రాకపోవడంతో నాసిరకమై న భోజనం పెడుతున్నారని, దీంతో ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయన్నారు.