కోదాడ, జూన్ 28 : విశ్రాంత ఉద్యోగులు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలువాలని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావెళ్ల. సీతారామయ్య అన్నారు. శనివారం కోదాడ విశ్రాంత భవనంలో విశ్రాంత ఉద్యోగులకు పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రిటైర్డ్ అయిన తర్వాత ఇంటి వద్ద ఒంటరిగా ఉండకుండా ప్రతిరోజు సంఘ కార్యాలయానికి వచ్చి ఆట, పాటలతో గడపాలన్నారు.
అనంతరం జన్మదిన వేడుకలు జరుపుకునే వారితో కేక్ కట్ చేయించారు. శాలువా, మెమెంటో, పూల బొకేతో వారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కోదాడ యూనిట్ అధ్యక్షుడు వేనేపల్లి శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్షుడు సుదర్శన్ రెడ్డి, బొల్లు రాంబాబు, పొట్ట జగన్మోహన్, హనుమారెడ్డి, వెంకటేశ్వరరావు, విద్యాసాగర్, నరసయ్య, భ్రమరాంబ, శోభ, రఘువరప్రసాద్ పాల్గొన్నారు.