దేవరకొండ, జూలై 12 : స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసేందుకే బీసీలకు రిజర్వేషన్ డ్రామా అని దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. శనివారం దేవరకొండ పట్టణంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో పేర్కొన్న ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు. బీసీ ఉప కులాల వర్గీకరణ ఊసే లేదన్నారు. ఎంబీసీలకు మంత్రి వర్గంలో స్థానం ఏమైందని ప్రశ్నించారు. గతంలో రాజస్థాన్, కేరళ, బీహార్ లో ఇలాంటి జీఓలు ఇస్తే కోర్టుల్లో నిలబడలేదన్నారు.
తెలంగాణలో ఇప్పటికే 56 శాతం రిజర్వేషన్లు అమలులో ఉన్నాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మీద నెపం నెట్టేస్తూ బీసీలను మోసం చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీల పట్ల కపట నాటకం ఆడుతూ పాలాభిషేకాలు చేసుకోవడం ఎంతవరకు సబబని ఆయన ప్రశ్నించారు. ఈ సమావేశంలో పార్టీ మండలాధ్యక్షుడు టీవీఎన్ రెడ్డి, వెలుగురి వల్లపు రెడ్డి, పీఏసీఎస్ మాజీ ఛైర్మన్ ముక్కమల్ల బాలయ్య, మాజీ వైస్ ఎంపీపీ చింతపల్లి సుభాశ్, ఆర్వపల్లి సరిత నరసింహ, గాజుల ఆంజనేయులు, మాధవరం జనార్దన్ రావు, నీల రవికుమార్, వేముల రాజు, బొడ్డుపల్లి కృష్ణ, రాయినబోయిన శ్రీను, బొడ్డుపల్లి మహేందర్, అరెకంటి రాములు, కేతావత్ శంకర్ నాయక్, ఎర్ర యాదగిరి,సత్యనారాయణ, కడారి సైదులు, గోసుల శివ, కర్నాటి రవి, శిమర్ల కృష్ణ, రమావత్ తులసిరామ్, గుండాల వెంకట్, ఆడారపు హరికృష్ణ, మైనంపల్లి ప్రవీణ్, శ్రీశైలం, వడ్థ్య గణేశ్, నార్య నాయక్ పాల్గొన్నారు.