మునుగోడు, ఏప్రిల్ 24 : మునుగోడు మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ పాలకూరి రమాదేవి శుక్రవారం ఉదయం సందర్శించారు. ధాన్యం కొనుగోళ్లపై ఇబ్బందులను రైతులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని, రైతులను ఇబ్బందులు పెట్టకుండా చూడాలని సంబంధిత అధికారులతో సెల్ఫోన్లో మాట్లాడారు. కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సౌకర్యాలు కల్పించాలన్నారు. ఈ క్రమంలో మునుగోడుకు వచ్చిన జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ కు ధాన్యం కొనుగోళ్ల ఇబ్బందులపై సర్పంచ్ పాలకూరి రమాదేవి వివరించారు. రైతులను ఇబ్బందులు పెట్టకుండా ధాన్యం కొనుగోలు చేయాలని కోరారు. స్పందించిన కలెక్టర్ వాహనాలను ఎక్కువగా ఏర్పాటు చేసి నిర్లక్ష్యం చేయకుండా కొనుగోలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
మునుగోడులో కుక్కల స్టెరిలైజేషన్ కేంద్రం ఏర్పాటుకు భవనాన్ని గుర్తించడాన్ని కలెక్టర్ చంద్రశేఖర్ శుక్రవారం పరిశీలించారు. కుక్క కాటు ఘటనలు పెరిగిపోతుండడంతో వీధి కుక్కల సంతతిని తగ్గించే ప్రక్రియను ప్రభుత్వం చేపడుతుందని, కుక్కలను పట్టుకునే బృందాలను ఏర్పాటు చేసి నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని ఈ సదర్భంగా కలెక్టర్ తెలిపారు. మండల కేంద్రంలో త్వరితగతిన కేంద్రం ఏర్పాటు చూడాలని తాసీల్దార్ నరేష్, సర్పంచ్ పాలకూరి రమాదేవి నరసింహ గౌడ్ కు కలెక్టర్ సూచించారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ శ్రీదేవి, ఎంపీడీఓ యుగంధర్ రెడ్డి, సెక్రటరీ రాజశేఖర్ రెడ్డి ఉన్నారు.