దేవరకొండ రూరల్, మే 14 : దేవరకొండ పరిధిలో ఇటీవల చోరీకి గురైన 21 మొబైల్ ఫోన్లను పోలీసులు రికవరీ చేశారు. ఈ ఫోన్లను బుధవారం ఏఎస్పీ మౌనిక బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చోరికి గురైన సెల్ఫోన్ల విలువ సుమారు రూ.4.5 లక్షలు ఉంటుందన్నారు. సెల్ఫోన్ పోగొట్టుకున్నా, అపహరణకు గురైనా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. త్వరితగతిన వాటిని రికవరీ చేసి అందజేయనున్నట్లు తెలిపారు. ఫోన్ల రికవరీలో పాల్గొన్న సీఐ నరసింహులు, ఎస్ఐలు రమేశ్, కోటేశ్, ఇతర సిబ్బందిని ఏఎస్పీ అభినందించారు.