దేవరకొండ రూరల్, జనవరి 26 : దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి ఉత్తమ ఉద్యోగ అవార్డు అందుకున్నారు. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తూ, ప్రజల ఆదరాభిమానాలు పొందినందున గణతంత్ర దినోత్సవాన నల్లగొండ జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ చేతుల మీదుగా సోమవారం ఆయన అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఉద్యోగుల సంఘం దేవరకొండ డివిజన్ అధ్యక్షుడు మహమ్మద్ అయ్యుబ్ ఖాన్, నాయబ్ తాసీల్దార్, పలువురు నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.