నల్లగొండ : వడ్ల కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది అని నల్లగొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. సోమవారం పీఏపల్లి ఘణపురం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..ఆరుగాలం కష్టపడి పండించిన పంట కొనే దిక్కులేక రైతులు అవేదన చెందుతున్నారని తెలిపారు. మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్టు రైతు పరిస్తితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులు తెచ్చి పంట పండిస్తే కొనే దిక్కులేక పోయారని విమర్శించారు.
అందాల పోటీలపై ఉన్న శ్రద్ధ ప్రభుత్వానికి రైతుల ధాన్యం కొనగోలుపై లేదు అని ఆయన అన్నారు. గన్ని బ్యాగులు ఇచ్చే పరిస్తితిలో ప్రభుత్వం లేదు మండిపడ్డారు. కేసీఆర్ ఉన్నపుడు ఎప్పుడూ వడ్ల కొనుగోలులో ఇంత ఆలస్యం కాలేదు అని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వం రైతుల నుండి తరుగు పేరిట 3 కేజీల వడ్లు కట్ చేస్తున్నారు. వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వం రైతుల ఉసురు పోసుకుంటుంది. పాలన చేతకాకుంటే రేవంత్ రెడ్డి దిగిపోవాలన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలి డిమాండ్ చేశారు.
అధికారులతో ఫోన్లో మాట్లాడి తక్షణమే ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు వేలుగురి వల్లపు రెడ్డి, మునగాల అంజి రెడ్డి, అర్వపల్లి నర్సింహ, మద సుధాకర్ గౌడ్, ఎర్ర యాదగిరి, రయినబోయిన శ్రీను, బొడ్డుపల్లి మహేందర్, వంగాల కృష్ణా రెడ్డి, గోలి గిరి, నిమ్మల విష్ణువర్ధన్ రెడ్డి, కర్నాటి రవి, ప్రదీప్, శివ, తదితరులు ఉన్నారు.