దేవరకొండ, నవంబర్ 06 : మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు తండ్రి సత్యనారాయణ రావు ఇటీవల అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే. గురువారం నిర్వహించిన దశదిన కర్మకు బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ హాజరయ్యారు. సత్యనారాయణ చిత్రపటానికి పుష్పాంజలి సమర్పించి హరీశ్‌రావును పరామర్శించారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.