నల్లగొండ, జూలై 16 : రేవంత్ పాలనను గాలికొదిలి బీఆర్ఎస్, కేసీఆర్‌ను ఆయన కుటుంబంపై విమర్శలతోనే కాలం గడుపుతున్నాడు తప్ప, ప్రజలను, అభివృద్ధి గురించి పట్టించుకోవటం లేదని బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ విమర్శించారు. బుదవారం బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, నలమోతు భాస్కర్‌రావు, మాజీ జడ్పీచైర్మన్ బండ నరేందర్రెడ్డలతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడా రు.తుంగతుర్తిలో రేషన్ కార్డులు ఇస్తామని ప్రభుత్వ సొమ్ముతో సభపెట్టి కేసీఆర్‌పై, మాజీమంత్రి జగదీశ్‌రెడ్డిపై దురుద్దేశంతో రాజకీయ విమర్శలు చేయటం ఆయన హోదాను దిగజార్చిందన్నారు. రేషన్ కార్డు లు అనేది పాత పథకమే అయినా దానిని ఆయనేదో కొత్తగా పెట్టినట్లు సభపెట్టి గొప్పలు చెప్పుకోవటమేంటని ప్రశ్నించారు. బీఆర్ఎస్ రేషన్ కార్డులు పదేండ్లల్లో ఒక్కటి కూడా ఇవ్వలేదని రేవంత్ అబద్ధ్దాలు చెబితే ప్రజలు నమ్మరన్న ఆయన 2016లో 31, 136, 2017లో 19,03, 2018లో 16,761, 2019లో 99,570, 2020లో 99,650, 2021 లో 3,11,025 రేషన్ కార్డులచ్చినట్లు తెలిపారు. బీసీ రిజర్వేషన్లపై కామారెడ్డి డిక్లరేషన్‌ను గాలికొదిలిన రేవంత్ కులగణనను ఆదరబాదరగా చేపట్టాడని, చీకటి ఒప్పందాలకు మోదీని, కేంద్ర మంత్రులను ఎన్నోసార్లు కలిసిన రేవంత్ బీసీ రిజర్వేషన్లపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.
తుంగతుర్తిలో రేషన్ కార్డులు ఇవ్వటానికి సభ పెట్టావా లేదంటే జగదీశ్‌రెడ్డిని, బీఆర్ఎస్ను తిట్టడానికి పెట్టావా అని నల్లగొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్‌రెడ్డి ప్రశ్నించారు. జగదీశ్‌రెడ్డిని మూ డు, నాలుగు ఫీట్లు అనటం కాదు..ఆయన చేసిన అబివృద్ధి ఎంత…మీ నాయకులు ఆరు ఫీట్లు ఉండి చేసిన అభివృద్ధి ఎంతో ఇక్కడి ప్రజలకు తెలుసన్నా రు. కాళేశ్వరం ద్వారా గోదావరి నీళ్లు ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీనేనని యాదాద్రి, సూర్యాపేట రైతులకు తెలుసని నువ్వు అబద్ధ్దాలు చెప్పినా ప్రజలు నమ్మరన్నారు. సీఎంతోపాటు మంత్రులు ఉత్తమ్, పొంగులేటి, తుమ్మల వారిస్థాయిని మరిచి మాట్లాడుతున్నారన్నారు. 2014కు ముందు 60లక్షల మెట్రిక్ టన్నుల వరి దిగుబడి ఉన్న రాష్ట్రంలో ఆ తర్వాత మూడు కోట్ల మె ట్రిక్ టన్నులకు పెరగటానికి కారణం బీఆర్ఎస్ కాదా అని ప్రశ్నించారు.
ప్రజాప్రతినిధులు పద్ధతిగా మాట్లాడాలే తప్ప..పద్ధతి తప్పి మాట్లాడి ప్రజల ఎదు ట పరువు తీసుకోవద్దని మిర్యాలగూడ మాజీ శాసనసభ్యులు నలమోతు భాస్కర్‌రావు సూచించారు. బీఆర్ఎస్ అవినీతి చేసిందని విమర్శలు చేస్తున్న మీరు 30,40 ఏండ్ల కింద మీ ఆస్తులు ఎన్ని.. ఇప్పుడు మీ ఆస్తులు ఎన్ని అనేది చూసుకొని మాట్లాడాలన్నారు. కేసీఆర్ సీతా రాం ప్రాజెక్టుకు నీళ్లిస్తే తుమ్మల నాగేశ్వర్ రావు సత్తుపల్లి, వైరాలకు నీళ్లు తీసుకెళ్తే అక్కడ నుంచి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పాలేరుకు తీసుకెళ్లడని …అక్కడ కాల్వ ల్లో ఇప్పటికీ నీళ్లు పారుతున్నా మన జిల్లా మంత్రులకు మాత్రం ఎడమకాల్వ కు నీళ్లివ్వాలనే సోయిలేదన్నారు.
ప్రజాప్రతినిధులు హుందాగా ఉండాలే తప్ప నోటికి వచ్చినట్లు మాట్లాడితే పెద్దవాళ్లు కారని జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి అన్నారు. అబద్ధా లు పదేపదే చెప్పి వాటిని నిజాలు చేయాలని చూస్తే మాత్రం ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. కృష్ణారెడ్డి, నిరంజన్‌వలి, దేవేందర్, సైదిరెడ్డి, సత్తయ్య గౌ డ్, పంకజ్‌యాదవ్, మల్లికార్జున్ రెడ్డి, రామ్మోహన్, అభిమన్యు శ్రీనివాస్, సత్యనారాయణ ఉన్నారు.