కొండమల్లేపల్లి, జూలై 3: కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ అరెస్టులతో బీఆర్ఎస్ పోరాటాలను ఆపలేదని, కాం గ్రెస్‌కు ప్రజలు గుణపాఠం చెప్పడం ఖాయమని బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. శుక్రవారం కొండమల్లేపల్లిలో నిర్వహించిన ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ గురువారం కాంగ్రెస్ మంత్రులు విసిరిన సవాల్‌ను స్వీకరిస్తూ తెలంగాణ భవన్ చేరుకున్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, గన్‌పార్క్‌కు బ యలుదేరిన మాజీ మంత్రి హరీశ్‌రా వు, ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, శ్రీనివాస్‌గౌడ్, కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడం, నిర్బంధించడం, అరెస్టు చేయడం ప్రజాస్వామ్యా న్ని అవమానించడమేనని అన్నారు.
ఇది కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ పరాకాష్ట పాలనకు, కక్ష సాధింపు చర్యకు నిదర్శనమన్నారు. అప్పుల అంశంపై ధైర్యం ఉంటే పూర్తి స్థాయిలో అసెంబ్లీలో చర్చ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఎంతమంది కాంగ్రెస్ మంత్రులు వచ్చినా కేటీఆర్, హరీశ్‌రావు లెక్కలతో సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. చర్చకు రావాలని సవాల్ విసిరి, చర్చకు వచ్చిన ప్రతిపక్ష నాయకులను పోలీసులతో అడ్డకోవడం సిగ్గుచేటన్నారు.
కాంగ్రెస్ జూట మాటలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. సవాల్ విసరడం, తోకముడవడం కాంగ్రెస్ మంత్రులకు అలవాటుగా మారిందన్నారు. ప్రభుత్వం చేసిన అవినీతిపై ప్రశ్నిస్తున్న ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ సతీమణిని హడావుడిగా ప్రాధాన్యత లేని శాఖకు బదిలీ చేయడం చూస్తే…ప్రభుత్వం ఎంత భయపడుతుందో అర్థమవుతోందని తెలిపారు. ఇవన్నీ సీఎం రేవంత్‌రెడ్డి రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని ఆరోపించారు.
పదేండ్ల బీఆర్ఎస్ హయాంలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని, రెండున్నర ఏండ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. దరిద్రపు కాంగ్రెస్ పాలన ఎప్పుడు పోతదో.. తమ బతుకులు ఎప్పుడు బాగుపడతాయో అని రాష్ట్రంలోని రైతులు, వృద్ధులు..సబ్బండవర్గాలు వేయి కండ్లతో ఎదురు చూస్తున్నారని అన్నారు.
ఏ ఊరికి, ఏ పల్లెకు, ఏ గూడేనికి పోయినా ప్రజలు కేసీఆర్‌ను గుర్తు చేసుకుంటూ.. మళ్లీ కేసీఆర్ పాలన కోరుకుంటున్నారని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి ఎన్ని కుతంత్రాలు, ఎన్ని దౌర్జన్యాలు చేసినా రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని అన్నారు. ఎన్ని అక్రమ అరెస్టులు చేసినా ప్రజల పక్షాన బీఆర్ఎస్ పోరాడుతూనే ఉంటుందని చెప్పారు.