మిర్యాలగూడ, ఆగస్టు 8: అన్నాచెల్లెళ్ల అనుబంధానికి రాఖీ పండుగ ప్రతీకగా నిలుస్తోందని పాఠశాల కరస్పాండెంట్ కుర్ర కాంతి, డైరెక్టర్ వినోద్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని షైనింగ్‌స్టార్ విస్డమ్ స్కూల్లో ముందస్తు రాఖీ పండుగను విద్యార్థులు ఘనంగా నిర్వహించుకున్నారు. విద్యార్థినులు తోటి విద్యార్థులకు రాఖీలు కట్టారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు బాలాజీ, సోమయ్య, కుసుమ, కాంతామణి, మంగమ్మ, చిన్న తదితరులు పాల్గొన్నారు.
త్రిపురారం, ఆగస్టు 8: మండల కేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ముందస్తు రాఖీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థినులు మొక్కలకు రాఖీలు కట్టారు. పంచాయతీ కార్యదర్శి కోడిరెక్క రాజేందర్, పాఠశాల ప్రిన్సిపాల్ కందిమళ్ల దామోదర్, కరెస్పాండెంట్ తుమ్మలపల్లి వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.
హాలియా, ఆగస్టు 8: హాలియా న్యూకిడ్స్ పాఠశాలలో శుక్రవారం రాఖీ పండుగను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు రాఖీలు కట్టుకొని పండుగ శుభాకాంక్షలు తెలిపారు. హెచ్ఎం మనాది శ్రీలత రవీందర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
నకిరేకల్, ఆగస్టు 8: అన్నాచెల్లెళ్ల అనురాగ బంధానికి ప్రతీక రక్షాబంధన్ వేడుకను శుక్రవారం నకిరేకల్ మండలం పాలెం ఎంపీయూపీఎస్‌లో విద్యార్థులు ఆనందోత్సాహాల నడుమ నిర్వహించుకున్నారు. ఒకరినొకరు స్వీట్లు తినిపించుకుని రాఖీ శుభాకాంక్షలు తెలిపారు.
శాలిగౌరారం, ఆగష్టు 8: మండల కేంద్రంలోని గీతాంజలి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో శుక్రవారం ముందస్తు రక్షాబంధన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు రాఖీలు కట్టి ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. కరస్పాండెంట్ పరమేశ్వరావు, ప్రిన్సిపాల్ ప్రభంజనం ఉన్నారు.
కొండమల్లేపల్లి, ఆగష్టు 8: మండల కేంద్రంలోని సాగర్ రోడ్డులో రెయిన్బో ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో రక్షాబంధన్ వేడుకలను శుక్రవారం విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఆవరణలో చెట్లకు రాఖీ కట్టారు. కరెస్పాండెంట్ ఆనంద్‌రెడ్డి, ప్రిన్సిపాల్ ఫర్హీన్ సుల్తానా, బాలయ్య, యశ్వంత్, సుష్మ, శ్రీలత, శైలజ, నాగమణి, కళ్యాణి, విజయలక్ష్మి, నికిత, కీర్తి, ధనమ్మ, ధనలక్ష్మి, సరిత, అనంతలక్ష్మి, సంధ్య, సువర్ణ, ఉమ పాల్గొన్నారు.