కొండమల్లేపల్లి, ఏప్రిల్ 22: మండలంలోని వివిధ గ్రామాల్లో గాలి దుమారంతోపాటు వడగండ్ల వర్షం కురిసింది. దీంతో చేతికొచ్చిన పంట నేలరాలడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. వివరాల్లోకి వెళ్తే ఉమ్మడి చెన్నారం పంచాయతీలో మంగళవారం సా యంత్రం అకస్మాత్తుగా గాలి వీచడంతోపాటు ఉరుము లు మెరుపులతో భారీఎత్తున వడగండ్ల వాన కురిసింది. దీంతో పర్వతాల చెరువు కింది సుమారు 200 వందల ఎకరాల్లో సాగు చేసిన వరి నేల రాలి తీవ్ర నష్టం జరిగిందని సర్పంచ్ రమావత్ తులసీరాం నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు.
పంట చేతికొచ్చే సమయంలో పంటలు నేలపాలు కావడం దురదృష్టకరమన్నారు. నష్టపోయి రైతులకు ప్రభుత్వ నష్టపరిహారంగా ఎకరాకు రూ.50 వేలు చెల్లించాలన్నారు. నేలరాలిన పంటలను తాసీల్దార్ నరేందర్, వ్యవసాయాధికారులు పరిశీలించారు. దీంతో పాటు మండలంలోని వడ్త్యాతండాలో పిడుగుపడి రెండు అవులు మృతి చెందాయి.