నీలగిరి, మార్చి 25 : అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారం అందించాలని నల్లగొండ 48వ డివిజన్ కార్పొరేటర్ యమా కవితరాణి దయాకర్ అన్నారు. బుధవారం పట్టణంలోని 48 డివిజన్ పరిధిలోని రామగిరి అంగన్వాడీ కేంద్రంలో స్థాయి సంఘం (ఏఎల్ఎంసి) సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు, చిన్నారుల్లో రక్తహీనతను తగ్గించేందుకు ప్రభుత్వం పౌష్టికాహారాన్ని పంపిణీ చేస్తోందని తెలిపారు. అర్హులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అంగన్వాడీ కేంద్రం సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ లక్ష్మమ్మ, అంగన్వాడీ టీచర్ బొబ్బలి శ్రీలక్ష్మి, ఆయా బానుచంద్ర, బాలింతలు, చిన్నారుల తల్లులు మనీషా, శ్వేతా, స్వప్న, లలిత, ప్రమీల, అరుణ, కావ్య, వేదశ్రీ, చైల్డ్ వెల్ఫ్ లైన్ కౌన్సిలర్ మహేశ్ పాల్గొన్నారు.