కోదాడ, మార్చి 25 : భారత తంతి తపాలా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన లేఖ రచన పోటీలో కోదాడ పట్టణానికి చెందిన కవి పుప్పాల కృష్ణమూర్తికి నగదు పురస్కారం లభించింది. ఈ మేరకు ఆ శాఖ నుండి ఆయన సమాచారం అందుకున్నారు. తంతి తపాలా శాఖ ఆధ్వర్యంలో డాయి ఆకర్ కార్యక్రమంలో భాగంగా లెటర్ టు మై రోల్ అనే అంశంపై 25 సెప్టెంబర్ నుండి డిసెంబర్ 2025 వరకు దేశ వ్యాప్తంగా వేలమంది లేఖ రచనలో పాల్గొన్నారు. ఈ పోటీలో పుప్పాల కృష్ణమూర్తికి రూ.10 వేల నగదు పుష్కారం లభించింది. ఈ సందర్భంగా కోదాడ, సూర్యాపేట కు చెందిన సాహితీ ప్రియులు, విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు రావిళ్ల సీతారామయ్య, కోదాడ సంఘ బాధ్యులు వేనేపల్లి శ్రీనివాసరావు, రఘు వరప్రసాద్ తోపాటు మిత్రులు, శ్రేయోభిలాషులు కృష్ణమూర్తికి అభినందనలు తెలిపారు.