రామగిరి (నల్లగొండ), జూన్ 12 : నల్లగొండ జిల్లా కేంద్రంలోని తులసినగర్ లో గల శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయానికి సంబంధించి పడమర వైపు ఉన్న 4 దుకాణాల అద్దెకు అలాగే కొబ్బరి చిప్పలను సేకరించుటకై ఈ నెల 16న బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈఓ కె.కుశలయ్య గురువారం తెలిపారు. బహిరంగ వేలం ద్వారా కిరాయికి ఇచ్చుటకు 16న ఉదయం 10:30 గంటలకు నిర్వహించే సమావేశానికి అర్హులైన వారందరూ హాజరై సద్వినియోగం చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకై దేవాలయంలో సంప్రదించాలని పేర్కొన్నారు.