రామగిరి, ఫిబ్రవరి 09 : పీఆర్టీయూ ఆవిర్భావ దినోత్సవాన్ని సోమవారం నల్లగొండ జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. పీఆర్టీయూ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు కాళం నారాయణరెడ్డి జెండా ఆవిష్కరించారు. సంఘ మూల పురుషులలోఒక్కరైనా బీరవోలు ధర్మారెడ్డి విగ్రహానికి పీఆర్టీయూ వ్యవస్థాపక సభ్యుడు జి.వెంకట్ రెడ్డి పూలమాల వేశారు. సంఘ వ్యవస్థాపకుడు సామల యాదగిరి చిత్రపటాన్ని జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల జానారెడ్డి పూలమాలతో అలంకరించారు. ఈ సందర్భంగా నారాయణరెడ్డి మాట్లాడుతూ పీఆర్టీయూ పంచాయత్ రాజ్ ఉపాధ్యాయుల ఆత్మ గౌరవం కోసం ఆవిర్భావించి 55 సంవత్సరాలు అయిందని ఈ కాలంలో ఉపాధ్యాయుల అనేక సమస్యలు పరిష్కరించిందని తెలిపారు. అనంతరం రిటైర్డ్ అయి సంఘ అభివృద్ధి కోసం కృషి చేసిన 20 మంది ఉపాధ్యాయులను జిల్లా సంఘం శాలువా, మెమోంటోతో ఘనంగా సత్కరించింది.
ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షుడు తిరందాసు సత్తయ్య, గాదె వెంకట్ రెడ్డి, సీనియర్ నాయకులు జి. సుదర్శన్ రెడ్డి, బసిరెడ్డి రవీందర్ రెడ్డి, ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి, ఓరుగంటి శ్రీనివాసులు, మెండు గురువారెడ్డి, ప్రతాప్ రెడ్డి, విజయ కుమార్ రెడ్డి, సైదులు రావు గౌతమ్, గోవర్ధన్ రెడ్డి, కొంగర సత్యనారాయణ, మోహన్ రావు, రఘు, కడారి అనితా, ముసుకు కవిత, కళావతి, వివిధ మండల శాఖ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, పీఆర్టీయూ సంఘం రాష్ట్ర, జిల్లా, మండలాల బాధ్యులు, ప్రాథమిక సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.