నల్లగొండ, ఆగస్టు 20 : ప్రముఖ విద్యావేత్త, సాహితీ అభిలాషకులు, నల్లగొండ పట్టణ ప్రముఖుడు కొండకింది చిన వెంకట్‌రెడ్డి మంగళవారం రాత్రి కన్నుమూశారు. ఆయన పార్థివ దేహాన్ని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించారు. అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యా, సాహితీవేత్తగా చిన వెంకట్‌రెడ్డి నల్లగొండ ప్రజలకు ఎన్నో సేవలు అందించారని కొనియాడారు. ఆయన మరణం ఎవరూ పూడ్చలేనిదన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
చిన వెంకట్‌రెడ్డి భౌతిక కాయాన్ని నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు తమ తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు. నివాళులర్పించిన వారిలో రాష్ట్ర కార్పోరేషన్ మాజీ చైర్మన్ కటికం సత్తయ్య గౌడ్, నల్లగొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చీర పంకజ్ యాదవ్, పార్టీ పట్టణ అధ్యక్షుడు భువనగిరి దేవేందర్, మాజీ కౌన్సిలర్ రావుల శ్రీనివాసరెడ్డి, బక్క పిచ్చయ్య, జగ్జీవన్, వీరమల్ల భాస్కర్‌తో పాటు పలువురు ప్రముఖులు ఉన్నారు.
Nalgonda : ప్రముఖ విద్యావేత్త కొండకింది చిన వెంకట్‌రెడ్డి కన్నుమూత