హైదరాబాద్, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ): ‘సివిల్ సర్వీసెస్ పరీక్షకు ఎలా సిద్ధం కావాలి-పూర్తి ప్రణాళిక, వ్యూహం’ అనే అం శంపై జేఎన్టీయూలో శుక్రవారం ప్రత్యేక సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా 2022 ఐపీఎస్ బ్యాచ్‌కి చెందిన నీపా మనోచా కీలకోపన్యాసం చేశారు. సివిల్ సర్వీసెస్ కోసం తన సాధన, ప్రభావవంతమైన అధ్యయన పద్ధతులు, ప్రిపరేషన్ సమయంలో స్థిరంగా ఉండటానికి అవసరమైన మనస్థత్వం గురించి నీపా మనోచా తన అనుభవాలు పంచుకున్నారు.
క్రమశిక్షణతో కూడిన దినచర్య, పునర్విమర్శ పద్ధతులు, ప్రిపరేషన్ దశలో భావోద్వేగ స్థితి స్థాపకతను కాపాడుకోవడం వంటి అంశాలను వివరించారు. అసిస్టెంట్ ఫ్యాకల్టీ శశాంక్ శర్మ విద్యార్థులతో ఇంటరాక్షన్ అవుతూ స్ట్రాటజీ సెషన్‌ను నిర్వహించారు. కార్యక్రమంలో జేఎన్టీయూ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జీవీ నరసింహారెడ్డి, కోఆర్డినేటర్ డాక్టర్ కే నాగసుజాత, సీఆర్సీ చైర్మన్ ప్రొఫెసర్ డాక్టర్ వీ పార్వతి తదితరులు పాల్గొన్నారు.