చండూరు, ఆగస్టు 29 : చండూరు మండలం అలాగే మున్సిపాలిటీ పరిధిలో సమస్యలు పరిష్కరించాలని బీజేపీ ఆధ్వర్యంలో శుక్రవారం నాయకులు బైక్ ర్యాలీగా వెళ్లి ఆర్డీఓ, ఎమ్మార్వోకు వినతి పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ జిల్లా కోశాధికారి కాసాల జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ.. మండల పరిధిలో సమస్యలు కుప్పలు తిప్పలుగా ఉన్నాయని వాటిని పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. వివిధ గ్రామాలకు లింక్ రోడ్లు లేవని, డ్రైనేజీల సమస్య వల్ల దోమలు అధికంగా ఉండి ప్రజలు సీజనల్ వ్యాధుల భారిన పడుతున్నారన్నారు. మండలంలోని సాగునీటి ప్రాజెక్టులైన శేషిలేటి ఫీడల్ ఛానల్, బెండాలమ్మ చెరువు, వెల్మకన్నే ఫీడల్ ఛానళ్ల పనులను పునరుద్ధరించాలన్నారు.
మున్సిపల్ ఇన్చార్జి బొడిగే అశోక్ గౌడ్ మాట్లాడుతూ.. మున్సిపాలిటీలో ప్రభుత్వం నిర్మించిన పబ్లిక్ పార్కులకు తాళాలు వేసి నిరుపయోగంగా ఉంటున్నాయని, వాటిని వెంటనే వినియోగంలోకి తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల మున్సిపల్ అధ్యక్షుడు ముదిగొండ ఆంజనేయులు, పందుల సత్యం గౌడ్, ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకుడు కోమటి వీరేశం, జిల్లా కౌన్సిల్ సభ్యులు నకిరేకంటి లింగస్వామి, భూతరాజు శ్రీహరి, యువ మోర్చా రాష్ట్ర నాయకుడు పిన్నింటి నరేందర్ రెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ బోడ ఆంజనేయులు, జిల్లా నాయకులు సముద్రాల వెంకన్న, తడకమల్ల శ్రీధర్ పాల్గొన్నారు.