మునుగోడు, సెప్టెంబర్ 03 : గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్, సీఐటీయూ ఆధ్వర్యంలో మండల కన్వీనర్ వరికుప్పల ముత్యాలు మునుగోడు ఎంపీడీఓ యుగంధర్ రెడ్డికి బుధవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలన్నారు. పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని, గ్రీన్ ఛానల్ ద్వారా ప్రతినెల 5వ తేదీ లోగా జీతాలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు.
అలాగే కార్మికులకు దుస్తులు, సబ్బులు, బూట్లు మొదలైన వస్తువులు ఇవ్వాలని, సంవత్సరానికి రెండు జతల బట్టలు ఇవ్వాలని కోరుతూ మండల అభివృద్ధి అధికారికి మెమోరాండం సమర్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ అధ్యక్షుడు పెరుమాళ్ల రాజు, గౌరవాధ్యక్షుడు ఎర్రగోని లింగయ్య, రెడ్డిమల్ల యాదగిరి, కొండోజు సత్యనారాయణ, నందిపాటి జలంధర్, ఎర్ర అరుణ, కొప్పోలు లింగయ్య, సంపూర్ణ, పావని, పెద్దమ్మ, అండాలు, కోసుకొండ నరసింహ, గోవర్ధన్, సింగపంగా సాయిలు, అండాలు, గోపమ్మ, వెంకటమ్మ పాల్గొన్నారు.