Minister Jagadish Reddy | సీఎం కేసీఆర్‌తోనే అర్చకులకు గుర్తింపు : మంత్రి జగదీష్ రెడ్డి
Minister Jagadish Reddy | ఆలయాల్లో నిత్య పూజల కోసం అర్చకులకు నెలకు అందించే రూ.6 వేల భృతిని రూ.10వేలకు పెంచిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి (Minister Jagadish Reddy) అన్నారు.
హైదరాబాద్ : ఆలయాల్లో నిత్య పూజల కోసం అర్చకులకు నెలకు అందించే రూ.6 వేల భృతిని రూ.10వేలకు పెంచిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి (Minister Jagadish Reddy) అన్నారు. ఏ ప్రభుత్వమూ చేయని విధంగా సీఎం కేసీఆర్ (CM KCR) అర్చకులకు (Priests) ప్రాధాన్యతనిస్తున్నారని వెల్లడించారు.
బుధవారం డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన అర్చకులు మంత్రిని మర్యాద పూర్వకంగా కలిసి అలవెన్సును జీవో (Government Order) జారీ చేసినందుకు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తూ మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. మంత్రి మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్ర ఫలాలను అన్ని వర్గాల ప్రజలకు అందించడానికి సీఎం కేసీఆర్ ఎనలేని కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.
ఆలయాలను అభివృద్ధి (Temples Development) చేయడానికి ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు చేస్తుందని వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అర్చకుల ఆశీర్వచనాలు, దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాక్షించారు. గత జూన్ నెలలో రంగారెడ్డి జిల్లాలో విప్రహిత బ్రాహ్మణ సదనం ప్రారంభోత్సవంలో పాల్గొన్న సీఎం అర్చకులపై వరాల జల్లు కురిపించిన విషయం తెలిసిందే.
ఇచ్చిన మాట ప్రకారం ధూప, దీప, నైవేద్యం అలవెన్స్(Allowance)ను రూ.10వేలకు పెంచుతూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 793 ,రాష్ట్ర వ్యాప్తంగా 6,541 దేవాలయాలకు ప్రయోజనం చేకూరనున్నదని మంత్రి వెల్లడించారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horoscope | 17-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
మంత్రిగారి సిఫార్సు.. మహా కుంభకోణం వివేక గంగాధరం!
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
రేవంత్ సర్కార్‌లో అన్నీ స్కామ్‌లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

