తుంగతుర్తి, మార్చి 24 : కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలు నేరవేర్చాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వడంతో తుంగతుర్తి మండల బీఆర్ఎస్వీ నాయకులను పోలీసులు మంగళవారం ముందస్తుగా అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ తుంగతుర్తి నియోజకవర్గ నాయకుడు తడకమళ్ల రవికుమార్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో అమలు కాని హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, రేవంత్ రెడ్డి గద్దెనెక్కినంక అన్ని వర్గాలను మోసం చేసిండని మండిపడ్డారు. అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసేంతవరకు పోరాటాలు చేస్తామన్నారు. అరెస్ట్ అయిన వారిలో బొజ్జ సాయికిరణ్, బొంకూరి మల్లేష్, కొండగడుపుల వెంకటేష్, కడియం గోపి, గడ్డం నితిన్ ఉన్నారు.