మునుగోడు, ఏప్రిల్ 11 : తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషక విలువలు ఉన్న రాగి జావా, పల్లి పట్టి, నువ్వుల లడ్డు, జొన్న లడ్డు, చిరుధాన్యాలతో లడ్డు, బెల్లంతో తయారు చేసిన పరమాన్నం, పుట్నాలు, వేరుశనగ పల్లీల పొడి, మునగాకు కారం పొడి మొదలగు పదార్థాలను గర్భిణీలు, బాలింతలు, పిల్లలకు ఆహారంగా అందివ్వాలని ఏసీడీపీఓ వెంకటమ్మ అన్నారు. నల్లగొండ జిల్లా మునుగోడు మండలంలోని చీకటిమామిడి, బీరెల్లిగూడెం, కల్వలపల్లి అంగన్వాడీ కేంద్రాల్లో శుక్రవారం పోషణ పక్షం ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఏసీడీపీఓ వెంకటమ్మ మాట్లాడుతూ.. రక్తహీనతకు గురికాకుండా ఐరన్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను ఆహారంగా తీసుకోవాలని సూచించారు. పోషక విలువలు గల ఆహార పదార్థాలు ఆకుకూరలు, పండ్లు, చిరుధాన్యాలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శివేష, నాగమణి, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, తల్లులు, పిల్లలు పాల్గొన్నారు.
Munugode : గర్భిణులు పోషకాహారం తీసుకోవాలి : ఏసీడీపీఓ వెంకటమ్మ