‘గర్భిణులు పౌష్టికాహారం తీసుకునేలా ప్రోత్సహించాలి’
చిన్నారులు, గర్భిణీలు, బాలింతల్లో రక్తహీనతను తగ్గించేందుకు పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకునేలా ప్రోత్సాహించాలని నల్లగొండ 24వ డివిజన్ కార్పోరేటర్, బీఆర్ఎస్ నేత గోపగాని స్వాతి రాజశేఖర్ అన్నారు. గురువారం మాన్యంచెల్క సెక్టార్...
– నల్లగొండ 24వ డివిజన్ కార్పోరేటర్ గోపగాని స్వాతి రాజశేఖర్
నీలగిరి, ఏప్రిల్ 16 : చిన్నారులు, గర్భిణీలు, బాలింతల్లో రక్తహీనతను తగ్గించేందుకు పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకునేలా ప్రోత్సాహించాలని నల్లగొండ 24వ డివిజన్ కార్పోరేటర్, బీఆర్ఎస్ నేత గోపగాని స్వాతి రాజశేఖర్ అన్నారు. గురువారం మాన్యంచెల్క సెక్టార్ పోషణ్ పక్వాడ కార్యక్రమాన్ని 24వ డివిజన్ కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన పోషణ్ పక్వాడపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సును అమె ప్రారంభించి మాట్లాడారు. పోషక ఆహార భారత్ నిర్మాణమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని, అందులో భాగంగా గర్భినీలకు, బాలింతలకు, చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తుందన్నారు. చాలా మంది మహిళలు రక్త హీనతతో బాధపడుతున్నారని దీనివల్ల చిన్నారులు బలహీనంగా అనారోగ్యంతో జన్మించి చనిపోతున్నారని తెలిపారు. దీన్ని అదిగమించేందుకు ప్రభుత్వం పోషణ్ అభియాన్ పేరుతో వెయ్యి రోజుల కార్యక్రమాన్ని తీసుకవచ్చిందన్నారు.
అంగన్వాడీ కేంద్రాల ద్వారా బాలింతలకు చిన్నారులకు, గర్భినీలకు పౌష్టికాహారా. అందిస్తుందున సద్వినియోగం చేసుకుని ఆరోగ్యవంతంగా ఉండాలన్నారు. మహిళల్లో రక్తహీనత కారణంగా చిన్నారులు పౌష్టికాహారం లోపాన్ని అధిగమించేందుకు గర్భిణులు, బాలింతలు ఏ సమయంలో ఎలాంటి అహారం తీసుకోవాలి, ఏ రకమైన భోజనం తీసుకోవాలనే అంశాలపై వారికి సంపూర్ణ అవగాహన కల్పించాలన్నారు. అనంతరం వివిధ కాలనీల్లో ర్యాలీ నిర్వహించి గర్భిణిని ఏలా చూసుకోవాలో భర్త చేత పాష్టికాహారం చేసి ఇప్పించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ జయమ్మ, అంగన్వాడీ టీచర్లు గుత్తా జ్యోతి, కత్తుల ప్రమీల, బక్క ప్రేమాలత, కవిత, దేప వాణీశ్రీ, జూలకంటి చంద్రకళ, నస్రీన్, ఝూన్సీ, పర్వీన్, స్వరూప పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

