నల్లగొండ సిటీ, డిసెంబర్ 17 : నల్లగొండ పట్టణంలోని పలు కాలనీలకు గురువారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనున్నట్లు అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్ వేణుగోపాలాచార్యులు బుధవారం తెలిపారు. 11కెవి డిస్ట్రిక్ట్ కోర్ట్ ఫీడర్, 11కెవి గొల్లగూడ ఫీడెర్ పరిధిలో గల ప్రకాశం బజార్, కోర్ట్ ఏరియా, జడ్పీ ఆఫీస్, మున్సిపాలిటీ ఏరియా, రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఏరియా, నటరాజ్ థియేటర్ రోడ్, బొట్టుగూడ, గొల్లగూడ, పెద్దబండ, బీటీఎస్, దుర్గా కాలనీ, కలెక్టర్ ఆఫీస్, ఫారెస్ట్ ఆఫీస్, మిర్యాలగూడ రోడ్ కాలనీలకు ఉదయం 09:00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంట వరకు రోడ్ విస్తరణలో 11కేవీ లైన్ షిఫ్ట్ అలాగే 11కేవీ లైన్లో చెట్ల కొమ్మలను తీయుట కోసం కరెంట్ బంద్ చేయబడుతుందన్నారు. కావునా పట్టణ ప్రజలు విద్యుత్ సంస్థతో సహకరించాలని ఆయన కోరారు.