ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు
హనుమంతుడి దయతో రాష్ట్రం సుభిక్షంగా ఉందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. ఆదివారం హనుమాన్ జయంతి పురస్కరించుకొని మంత్రి తన సతీమణి సునీత, కుమారుడు వేమన్రెడ్డితో కలిసి మండలంలోని వెల్మినేడు ఆంజనేయ స్వామికి 108 వెండి తమలపాకుల హారాన్ని సమర్పించి మొక్కును చెల్లించుకున్నారు.
- వెలిమినేడు ఆంజనేయ స్వామి ఆలయ పూజల్లో పాల్గొన్న మంత్రి జగదీశ్‌రెడ్డి, కుటుంబ సభ్యులు
- స్వామివారికి వెండి తమలపాకుల హారం అందజేత
హనుమాన్ జయంతి వేడుకలు ఆదివారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఆలయాల్లో ఆంజనేయ స్వామికి అభిషేకాలు, పూజలు నిర్వహించారు. భారీ ర్యాలీలు తీశారు. చిట్యాల మండలం వెలిమినేడులోని ఆంజనేయ స్వామి ఆలయంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి.. తన సతీమణి సునీత, తనయుడు వేమన్రెడ్డితో కలిసి పూజలు చేశారు. ఈ సందర్భంగా స్వామివారికి 108 వెండి తమలపాకుల హారాన్ని సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు. మంత్రి వెంట ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఉన్నారు.
చిట్యాల, మే 14 : హనుమంతుడి దయతో రాష్ట్రం సుభిక్షంగా ఉందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. ఆదివారం హనుమాన్ జయంతి పురస్కరించుకొని మంత్రి తన సతీమణి సునీత, కుమారుడు వేమన్రెడ్డితో కలిసి మండలంలోని వెల్మినేడు ఆంజనేయ స్వామికి 108 వెండి తమలపాకుల హారాన్ని సమర్పించి మొక్కును చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మంత్రి దంపతులతోపాటు నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం మంత్రి దంపతులకు ఆశీర్వచనం అందజేశారు. గుత్తా వెంకట్‌రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ గుత్తా అమిత్‌రెడ్డి హనుమాన్ జయంతి కార్యక్రమంలో పాల్గొని లక్ష పుష్పార్చన చేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, చిట్యాల మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చినవెంకట్‌రెడ్డి, జడ్పీటీసీ సుంకరి ధనమ్మాయాదగిరి, కొలను వెంకటేశ్, కల్లూరి మల్లారెడ్డి, కూరెళ్ల లింగస్వామి, దేవరపల్లి సత్తిరెడ్డి, మత్స్యేందర్, గుత్తా యువసేన అధ్యక్షుడు వనమా వెంకటేశ్వర్లు, చిట్యాల కనకదుర్గ ఆలయం చైర్మన్ శీలా సత్యనారాయణ, నాగరాజురెడ్డి, రాజు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

