వేణుకు ఎంపీ వద్దిరాజు లక్ష ఆర్థిక సాయం
కాంగ్రెస్ సర్కార్ ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడం లేదని తీవ్ర మ నస్తాపంతో ఆత్మహత్యకు యత్నించిన ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం న్యూ లక్ష్మీపురం గ్రామానికి చెందిన గడ్డం వేణుకుమార్‌కు బీ ఆర్ఎస్ నేత, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర లక్ష ఆర్థిక సాయం అందజేశారు.
- అందజేసిన బీఆర్ఎస్ నేత కమల్‌రాజ్
ముదిగొండ, ఆగస్టు 6 : కాంగ్రెస్ సర్కార్ ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడం లేదని తీవ్ర మ నస్తాపంతో ఆత్మహత్యకు యత్నించిన ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం న్యూ లక్ష్మీపురం గ్రామానికి చెందిన గడ్డం వేణుకుమార్‌కు బీ ఆర్ఎస్ నేత, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర లక్ష ఆర్థిక సాయం అందజేశారు. ఆయన పంపిన నగదును ఖమ్మం జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, బీఆర్ఎస్ నాయకులు గురువా రం వేణును పరామర్శించి అందజేశారు.
కాంగ్రెస్ హామీని నమ్మి మోసపోయిన: వేణు
ఆత్మహత్యకు యత్నించిన తాను అసలు బతుకుతానని అనుకోలేదని వేణుకుమార్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని పదే పదే చెబితే ‘నాకు ఏదో ఒక ఉద్యోగం రాకపోతుందా?’ అని భావించినట్టు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు దాటినా ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని, జ్యాబ్ క్యాలెండర్ ఊసే లేదని విమర్శించారు.
ప్రభుత్వ వైఫల్యాలపై ఏదైనా మాట్లాడితే బెదిరిస్తున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. ‘నాకు ఇందిరమ్మ ఇల్లు రాలేదని అడిగితే.. మా గ్రామంలోని ఓ నాయకుడు నీకు ఇల్లు రాదు.. రానివ్వను’ అని అన్నాడని, ఇంతకంటే అన్యాయం ఉంటుందా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ తనకు ఎంతో అండగా నిలిచిందని, కేటీఆర్ సార్ కూడా తనతో మాట్లాడి ధైర్యం చెప్పారంటూ అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | అసమాన ప్రతిభతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు.. చిన్నారిని అభినందించిన స్కూల్ యాజమాన్యం..!
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

