తుంగతుర్తి, మే 23 : తుంగతుర్తి మండల పరిధిలోని గొట్టిపర్తి గ్రామ శివారులో విద్యుత్ వైర్లు ప్రమాదకరంగా మారాయి. రైతు భూక్య శంకర్ సహా పలువురి వ్యవసాయ పొలాల్లో కరెంట్ లైన్లు కిందకు వేలాడుతున్నాయి. దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని రైతులు బిక్కుబిక్కుమంటూ పనులు చేసుకుంటున్నారు. గాలివానకి వైర్లు తెగిపడేలా ఉన్నాయని, కర్రలు సపోర్టుగా పెట్టినా లాభం లేదని, అధికారులు స్పందించి వైర్లను సరిచేయాలని రైతన్నలు వేడుకుంటున్నారు.