కోదాడ, మే 27 : కోదాడ పట్టణానికి చెందిన సీనియర్ న్యాయవాదులు బండి వీరభద్రరావు, ఎడ్లపల్లి వెంకటేశ్వర్లు లీగల్ ఎయిడ్ కౌన్సిలర్లుగా నియమితులయ్యారు. ఈ మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ లక్ష్మీ శారద ఉత్తర్వులు జారీ చేశారు. మొదటి ఏడీఎం కోర్టు లీగల్ ఎయిడ్ కౌన్సిల్ గా బండి వీరభద్రరావు అనంతగిరి, కోదాడ రూరల్ మండలాలు, రెండవ ఏడీఎం కోర్టు కౌన్సిల్ గా ఎడ్లపల్లి వెంకటేశ్వర్లు మునగాల, చిలుకూరు మండలాలకు వ్యవహరించనున్నారు.
లక్ష రూపాయల లోపు వార్షిక ఆదాయం కలిగిన నిరుపేదలు మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఉచితంగా అందించే ఈ న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోవాలని వారు ఈ సందర్భంగా సూచించారు. వీరభద్రరావు, వెంకటేశ్వర్లు నియామకం పట్ల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సీహెచ్ లక్ష్మీనారాయణ రెడ్డి, మేకల వెంకట్రావు, రామకృష్ణ, గట్ల నరసింహారావు, సీహెచ్ రామిరెడ్డి, యశ్వంత్ రామారావు, ఎంవీఎస్ శాస్త్రి, కె.వి.నవీన్ కుమార్, ఇతర న్యాయవాదులు హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.