నందికొండ, ఆగస్టు 20 : లక్షలు ఖర్చు చేసి బీటెక్ ఇంజినీరింగ్ చేయలేని పేద విద్యార్థులకు పాలిటెక్నిక్ విద్య వరమని, బీటెక్ ఇంజినీరింగ్ చేయకున్నా ఆ స్థాయిలో ఉపాధి అవకాశాలు పాలిటెక్నిక్ చేసిన విద్యార్థులకు లభ్యమవుతాయని మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. గురువా రం ఆయన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేశ్రెడ్డి, ఇంద్రసేనారెడ్డితో కలిసి పైలాన్ కాలనీలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులతో కలిసి బైపాస్ రోడ్డు వర కు ర్యాలీ నిర్వహించి రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవో 97ను రద్దు చేయాల ని, పాలిటెక్నిక్ విద్యను శక్తి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తెచ్చే నిర్ణయాన్ని నిలిపివేయాలని, పాలిటెక్నిక్ విద్యను ఎస్బీ, టెట్ పరిధిలోనే కొనసాగించాలన్నారు. జీవో 97తో పాలిటెక్నిక్ విద్య ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లే కుట్ర జరుగుతుందన్నారు.
సాంకేతిక విద్యకు పాలిటెక్నిక్ కళాశాలలు కీలకమైన పునాదులని, పేద, మధ్య తరగతి కుటుంబాలకు నాణ్యమైన సాంకేతిక విద్యనందించే గొప్ప వ్యవస్థగా ఉన్న పాలిటెక్నిక్ విద్యను నాశం చేసే ప్రయత్నాన్ని ప్రభుత్వం విరమించుకోవాలన్నారు. కొత్త విధానంతో విద్యార్థులను విద్యకు దూరం చేస్తున్నారని మండిపడ్డారు. ఏనుగుల రాకేశ్రెడ్డి మాట్లాడుతూ ప్రభు త్వం విద్యార్థి వ్యతిరేక విధానాలను వీడాలని, జీవో నం 97 వల్ల పాలిటెక్నిక్ విద్యార్థుల విద్య, ఉద్యోగ అవకాశాలపై తీవ్ర ప్రభావం పడుతుందని వారి భవిష్యత్తు అంధకారం అవుతుందని ఆందోళన వ్యక్త చేశారు. కార్యక్రమం లో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఇంద్రసేనారెడ్డి, నందికొండ, హాలియా మున్సిపాలిటీ బీఆర్ఎస్ నాయకులు, పాలిటెక్నిక్ విద్యార్థులు పాల్గొన్నారు.
రామగిరి, ఆగస్టు 20: ప్రభుత్వం తెచ్చిన జీవో 97 పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేలా ఉం దని బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం నల్లగొండలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వద్ద బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ…స్వాతంత్య్రం వచ్చిన నాటి నుం చి నేటి వరకు ఏఐసీటీఈ నిబంధనల ప్రకారం స్టేట్ బోర్డు ఆఫ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు విజయవంతంగా నడుస్తున్నాయన్నారు.
అయితే నేడు స్కిల్ యూనివర్సిటీ పేరుతో దశాబ్దాల చరిత్ర ఉన్న వ్యవస్థను ప్రైవేట్ పరంచేసి, బడా బాబులకు కట్టబెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తోందని మండిపడ్డారు. పాలిటెక్నిక్ కళాశాలలను ప్రైవేటు పరం చేయడమంటే నిరుపేద, మధ్యతరగతి విద్యార్థులకు వృత్తి విద్యను దూరం చేయడమేనన్నారు. తక్షణమే ముఖ్యమంత్రి స్పందించి జీవో నం 97ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేసి, సీఎం కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించా రు. నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్వీ జిల్లా నాయకులు కాడింగు శ్రీకాంత్ గౌడ్, బకరం నరేందర్, రమేష్, వెంకటేష్, ఆంజనేయులు, రాజు కుమార్, శివ, మురళి, సురేష్, నాగరాజు, రాజు తదితరులు పాల్గొన్నారు.

సూర్యాపేట, ఆగస్టు 20: ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గురువారం పాలిటెక్నిక్ కళాశాలల బంద్ పాటించాయి. పాలిటెక్నిక్ కళాశాలలు, విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వద్ద విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు దనియాకుల శ్రీకాంత్ వర్మ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభు త్వం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పేరుతో పాలిటెక్నిక్ డిప్లమో కోర్సులను ఐటీఐ-ఏటీసీలతో అనుసంధా నం చేయడం విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటుందన్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడకుండా విద్యా నిపుణులతో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలన్నా రు. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకుంటే పాలిటెక్నిక్ విద్యార్థుల ఆధ్వర్యంలో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు ఆకారపు సాయి, నవీన్, మహేశ్, గోపికృష్ణ, రిషిత, ఇరుగు ఇందు, స్నేహ, అమృత వర్షిణి, నవీన, శ్రీవాణి, హాసిని, గాయత్రి, లహరి పాల్గొన్నారు.