Sarah Khalifa | డ్రగ్స్ కేసులో ఈజిప్టు టీవీ యాంకర్‌కు మరణశిక్ష
Sarah Khalifa | డ్రగ్స్ కేసులో ఈజిప్ట్ టీవీ ప్రెజెంటర్ సారా ఖలీఫాకు మరణశిక్ష పడింది. ఆమెతో పాటు మరో 11 మంది నిందితులకు కూడా మరణశిక్ష విధిస్తూ ఈజిప్టు కోర్టు తీర్పు ఇచ్చింది.
Sarah Khalifa | డ్రగ్స్ కేసులో ఈజిప్ట్ టీవీ ప్రెజెంటర్ సారా ఖలీఫాకు మరణశిక్ష పడింది. ఆమెతో పాటు మరో 11 మంది నిందితులకు కూడా మరణశిక్ష విధిస్తూ ఈజిప్టు కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ కేసులో మరో తొమ్మిది మందికి జీవిత ఖైదు విధించగా.. ఏడుగురిని నిర్దోషులుగా కోర్టు ప్రకటించింది. భారీ స్థాయిలో మాదకద్రవ్యాల తయారీ, అక్రమ రవాణా చేస్తున్నట్లు రుజువు కావడంతో ఈ మేరకు తీర్పు వెలువరించింది.
39 ఏళ్ల సారా ఖలీఫా ఈజిప్టులో టెలివిజన్ ప్రెజెంటర్‌గా గుర్తింపు పొందారు. భద్రత, నేరాలకు సంబంధించిన అంశాలపై ప్రసారమయ్యే ‘మిషన్ ఇంపాజిబుల్’ అనే కార్యక్రమానికి ఆమె యాంకర్‌గా వ్యవహరించారు. అంతేకాకుండా కాస్మెటిక్ సర్జరీ క్లినిక్‌తో పాటు పార్టీలు, ఈవెంట్లను నిర్వహించే ప్రొడక్షన్ కంపెనీని కూడా ఆమె నిర్వహిస్తున్నట్లు ఈజిప్టు మీడియా కథనాలు పేర్కొన్నాయి.
అయితే సారా ఖలీఫా, ఇతర నిందితులు ముఠాగా ఏర్పడి.. విదేశాల నుంచి మాదకద్రవ్యాల తయారీకి అవసరమైన ముడి పదార్థాలను దిగుమతి చేసుకున్నారని ప్రాసిక్యూషన్ ఆరోపించింది. వాటితో సింథటిక్ డ్రగ్స్ తయారు చేసి విక్రయించేందుకు ముఠా సభ్యులు వేర్వేరు బాధ్యతలు నిర్వర్తించినట్లు తెలిపింది.
పోలీసు దర్యాప్తులో భాగంగా 750 కిలోలకు పైగా మాదకద్రవ్యాలు, డ్రగ్స్ తయారీకి ఉపయోగించే పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ ల్యాబ్‌లుగా ఉపయోగిస్తున్నట్లు అనుమానించిన రెండు అపార్ట్మెంట్లను కూడా గుర్తించారు. అక్కడ అక్రమంగా కలిగి ఉన్న తుపాకులు, మందుగుండు సామగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నారు.
అయితే తనపై వచ్చిన ఆరోపణలను సారా ఖలీఫా మొదటి నుంచి ఖండిస్తున్నారు. తనకు డ్రగ్స్‌తో ఎలాంటి సంబంధం లేదని ఆమె చెబుతున్నారు. గతేడాది సెప్టెంబర్‌లో జరిగిన విచారణ సందర్భంగా.. ఈజిప్టు యాంటీ నార్కోటిక్స్ అధికారుల కార్యాలయంలో డ్రగ్స్‌తో ఉన్న ఫొటోలు తీసే వరకు తాను వాటిని ఎప్పుడూ చూడలేదని న్యాయమూర్తికి చెప్పినట్లు సమాచారం. తాను జీవితంలో సిగరెట్ కూడా కాల్చలేదని దర్యాప్తు అధికారులకు తెలిపినట్లు ఈజిప్టు మీడియా పేర్కొంది. కోర్టులో సారా ఖలీఫా కన్నీటిపర్యంతమై తనను క్షమించాలని వేడుకున్నారు. కాగా, కోర్టు మరణశిక్ష విధించిన నేపథ్యంలో ఆమె తరఫు న్యాయవాది తీర్పును సవాల్ చేస్తూ అప్పీల్ చేయనున్నట్లు తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
Punjab Drug | పంజాబ్‌లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
Chiranjeevi | మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వైజాగ్‌లో చిరంజీవి నయా ప్లాన్..!
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

