– దేవరకొండ పట్టణంలోని 3వ వార్డుకు చెందిన 120 కుటుంబాలు కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ చేరిక
– ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
దేవరకొండ, జనవరి 28 : మున్సిపల్ ఎన్నికల్లో దేవరకొండ ఖిల్లాపై గులాబీ జెండా ఎగురడం ఖాయమని బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. బుధవారం దేవరకొండ పట్టణంలోని 3వ వార్డుకు చెందిన మద్ది మడుగు సైదులుతో పాటు సుమారు 120 కుంటాంబాలు మాజీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా రవీంద్ర కుమార్ మాట్లాడుతూ.. దేవరకొండ పట్టణంలో బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధిని వివరించారు. నేటి కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు కాని విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. మున్సపల్ ఎన్నికల్లో అన్ని వార్డుల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించేలా ప్రతి కార్యకర్త సైనికుడిగా పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు భీల్యానాయక్, కిషన్ నాయక్, నీల రవికుమార్, జానీ బాబా, ఇల్యాస్ పటేల్, సీతారాం నాయక్, కృష్ణ, హరి నాయక్, రమేష్, ఎన్నికల ఇన్చార్జి పాల్వయ్ స్రవంతి, గాజులు ఆంజనేయులు, రాజు పాల్గొన్నారు.